నిరర్థక ఆస్తులతో బ్యాంకులు కునారిల్లుతున్నాయి. ఆ నష్టాలు పూడ్చుకునేందుకు కస్టమర్లపై వివిధ రకాలుగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. కార్పోరేట్లకు వందల, వేల కోట్లు అప్పులిచ్చి వారి ఎగ్గొడితే ఏమీ చేయని బ్యాంకులు.. వినియోగ దారుల నుంచి మాత్రం ముక్కుపిండి చార్జీలు వసూలు చేస్తాయన్న చెడ్డ పేరు ఉంది.


అయితే ఇప్పుడు బ్యాంకులకు ఓ గుడ్ న్యూస్.. 2019 మార్చి 31 వరకూ.. బ్యాంకులకు ఉన్న నిరర్దక ఆస్తుల విలువ.. 9లక్షల 40వేల కోట్ల రూపాయలు... ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ నిరర్దక ఆస్తుల 9లక్షల 10వేల కోట్ల రూపాయలకు చేరుకుంటాయట. అంటే.. 30 వేల కోట్ల రూపాయల నష్టాలు తగ్గుతాయన్నమాట.


ఇంతకీ ఈ న్యూస్ చెప్పింది ఎవరు.. క్రిసిల్, అసోచామ్ సంయుక్త సర్వేలో ఈ విషయం తేలింది. ఈ నివేదిక ఇంకా ఏంచెప్పిందంటే.. ఇప్పటివరకూ బ్యాంకులు ఇస్తున్న అప్పల్లో 70 శాతం కార్పొరేట్ రుణాలేనట. తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రుణం విలువ 5లక్షల 40వేల కోట్ల రూపాయలుగా ఉందట. బ్యాంకులకు రావాల్సిన రుణాల్లో లక్షా 30వేల కోట్ల రూపాయలను మొండిబకాయిలుగా గుర్తించలేదట. రాబోయే కాలంలో అవి


ఆ రూపంలోకి మారుతాయట. విద్యుత్ , మౌలిక సదుపాయాలు, స్టీలు కంపెనీల మొండిబకాయిలు నాలుగు లక్షల 10వేల కోట్ల రూపాయలకు చేరాయట. ఆర్బీఐ కొత్తగా రూపొందించిన మొండి బకాయిల విధివిధానాల వల్ల విద్యుత్ కంపెనీలకు మేలు చేసే అవకాశం ఉందట.


ఇవన్నీ బ్యాంకులకు గుడ్ న్యూస్ సరే.. మరి ఈ రికవరీలో వినియోగదారులను ఏమైనా పట్టించుకుంటారా.. వారికి మాత్రం వడ్డన తప్పదా.. నష్టాల పేరుతో బాదే బ్యాంకులు లాభాలు వస్తే.. వినియోగదారులకు ఊరట కలిగించాలి కదా..


మరింత సమాచారం తెలుసుకోండి: