పండుగా వస్తే చాలు ఆఫర్లు భారీగా ఇచ్చేస్తాయి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఈ-కామర్స్ సంస్థలు. మాములు సమయం 20 వేలకు వచ్చేది ఆఫర్ సమయంలో 10 వేలకు వచ్చేస్తుంది. ఒకోసారి అయితే 5 వేలకు కూడా వచ్చేస్తుంది. అన్ని ఆఫర్స్ ఇస్తాయి ఈ-కామర్స్ సంస్థలు. మొన్నటికి మొన్న దసరా సెల్ తో కస్టమర్లను అదరగొట్టిన ఈ సంస్ధలు ఇప్పుడు మళ్ళి వస్తున్నాయి. 


దీపావళి ఆఫర్ అంటూ కస్టమర్లను ఉక్కిరిబిక్కిరి చెయ్యడానికి వచ్చేస్తున్నాయి. అయితే ఈ-కామర్స్ సంస్థలు అన్ని వివిధ రకాల బ్యాంకులతో జతకట్టాయి. దీంతో ఈ-కామర్స్ సంస్థలు ఇచ్చే ఆఫర్స్ కాకా అదనపు అదనపు డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నాయి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. 


అలాగే రిటైల్ స్టోర్లు కూడా పలు ఆకర్షణీయ ఆఫర్లు అందిస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలోనే జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మోసపోవాల్సి వస్తుంది. కార్డుల ద్వారా కొనుగోళ్లు జరిపే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అని లేదంటే అసలుకే మోసం వస్తుంది అని లైరా నెట్‌వర్క్ ఇండియా సీఈవో, డైరెక్టర్ రాజేశ్ దేశాయ్ తెలిపారు. లావాదేవీలు నిర్వహించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే .. 


పాస్‌వర్డ్ మేనేజర్ ఉపయోగించి పాస్‌వర్డ్ ఎన్‌క్రిప్ట్ చేసుకోవాలి.


పబ్లిక్ వైఫై, కంప్యూటర్లను ఉపయోగించకూడదు.


బ్యాంకింగ్ వివరాలను గోప్యాంగా ఉంచుకోవాలి.


నమ్మకం లేని యాప్స్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవద్దు.  


తెలిసిన, విశ్వసనీయమైన మర్చంట్స్ వద్దనే కొనుగోళ్లు జరపండి.


బలమైన, క్లిష్టమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోండి.


ఫోన్‌లో ఏమైనా సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయో, లేదో తెలుసుకోండి.


చూశారుగా.. ఈ జాగ్రత్తలను పాటించి ఆన్లైన్ ఈ కామర్స్ సంస్ధలలో మోసపోకుండా జాగ్రత్త పడండి.   


మరింత సమాచారం తెలుసుకోండి: