మధ్యప్రాచ్యంలో వ్యవహారాల పర్యవేక్షణకు అమెరికా తన సైనిక శక్తి వినియోగించడం అతి పెద్ద తప్పిదమని ఆ దేశ అధ్యక్షుడు  డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా దళాలు క్షేమంగా స్వదేశానికి తిరిగొచ్చేందుకే తాను కృషి చేస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. సిరియాలో విధులు నిర్వర్తిస్తున్న స్పెషల్ ఆపరేటర్లను వెనక్కు రప్పించాలన్న ఆయన నిర్ణయం పలు విమర్శలకు దారి తీసిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. "మధ్య ప్రాచ్య వ్యవహారాల పర్యవేక్షణకు అమెరికా ఇప్పటివరకూ 8 లక్షల కోట్ల డాలర్లు( రూ. 5.6 కోట్ల కోట్లు) ఖర్చుచేసింది. ప్రాణాలు పోగొట్టుకున్న సైనికులు, క్షతగాత్రులైన వారు వేలల్లో ఉన్నారు. మధ్యప్రాచ్యంలో కూడా అనేక మంది అసువులు బాశారు. మధ్యప్రాచ్యం వ్యవహరాల్లో అమెరికా కలుగచేసుకోవడం పెద్ద తప్పిదం" అని ట్రంప్ ట్వీట్ చేశారు.

కానీ ఆర్థిక సంబంధాల ముందు ఏవీ నిలబడవు అని చెప్పడానికి తాజాగా రెండు దేశాల మధ్య జరుగుతున్న సంఘటనలే సాక్ష్యం.\


అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న 29 వస్తువులపై భారత్ కస్టమ్స్ డ్యూటీని పెంచింది. వాటిలో ఆహారదినుసులు, ఇనుము, ఉక్కు ఉత్పత్తులు మొదలైనవి ఉన్నాయి. కానీ భారత్ ఎందుకు ఈ చర్య తీసుకుంది?నిజానికి మోదీ ప్రభుత్వానిది ప్రతీకార చర్య. మొదట అమెరికా ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాన్ని పెంచింది.భారత్ ఈ రెండూ అమెరికాకు ఎగుమతి చేస్తుంది. దీని వల్ల అమెరికాపై సుమారు రూ.162 కోట్ల భారం పడనుంది.ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం నడుస్తోంది. అమెరికా రక్షణాత్మక విధానాలను అనుసరిస్తూ విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాన్ని పెంచింది.


దీనికి ప్రతిగా యూరోపియన్ యూనియన్ కూడా అమెరికా నుంచి దిగుమతి అవుతున్న పలు ఉత్పత్తులపై సుంకాన్ని పెంచింది. చైనా కూడా ఇదే బాటలో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: