బంగారం ధర రోజురోజుకు క్రమంగా తగ్గుతోంది. గత కొన్ని నెలల నుండి క్రమంగా పెరిగిన బంగారం ధర ప్రస్తుతం రోజురోజుకు క్షీణిస్తోంది. త్వరలోనే దీపావళి పండుగ రాబోతూ ఉండటంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు ఆశిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ లో ధర తగ్గుతూ ఉండటంతో బంగారం ధర భారత్ లో కూడా తగ్గుతోంది. 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం మార్కెట్ లో 37,870 రూపాయలుగా ఉంది. 
 
బంగారం ధర ఏకంగా సెప్టెంబర్ నెల గరిష్ట స్థాయితో పోల్చి చూస్తే 2,000 రూపాయలకు పైగా తగ్గింది. సెప్టెంబర్ నెలలో బంగారం ధర 40,000 రూపాయలకు చేరిన విషయం తెలిసిందే. బంగారం ధర తగ్గుతూ ఉండటంతో వెండి ధర కూడా క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం మార్కెట్ లో వెండి ధర 45,200 రూపాయలుగా ఉంది. గత నెల గరిష్ట స్థాయితో పోల్చి చూసినపుడు వెండి ధర 6,000 రూపాయలకు పైగా తగ్గటం విశేషం. 
 
చైనా, అమెరికా దేశాల మధ్య ఉన్న అగ్రిమెంట్ కారణంగా ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ భవిష్యత్తులో మాత్రం బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. చైనా దిగుమతులపై అమెరికా సుంకం విధించాలనే ఆలోచన చేస్తున్నప్పటికీ ఈ విషయం గురించి పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. దీపావళి పండుగ ఉండటంతో కొంతమంది వ్యాపారులు ఆఫర్లను ప్రకటించి కొనుగోళ్లు చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: