పండుగవేళ హెచ్‌డీఎఫ్‌సీ మోర్ట్‌గేజ్ రుణాలు తీసుకునే కస్టమర్లకు తీపికబురు కబురు అందించింది. బెంచ్‌మార్క లెండింగ్ రేట్లను తగ్గిస్తూ హెచ్‌డీఎఫ్‌సీ సంచలన నిర్ణయం తీసుకుంది. 10 బేసిన్ పాయింట్ల కోత విధించి 10 రోజుల ముందే కస్టమర్లకు దీపావళి పండుగ వచ్చినట్టు చేసింది. 


సంస్థ రేట్ల కోత నిర్ణయంతో హోమ్ లోన్స్‌పై రుణ రేట్లు భారీగా దిగిరానున్నాయి. దీంతో ఇప్పటి నుండి వచ్చే కొత్త కస్టమర్లకు తక్కువ రుణానికే లోన్స్ అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ తగ్గింపు పాత కస్టమర్లకు, కొత్త కస్టమర్లకు ఇద్దరికీ వర్తిస్తుందని సంస్ద తెలిపింది. కాగా పాత కస్టమర్లకు ఈఎంఐ భారం తగ్గుతుందని సంస్ద తెలిపింది. 


కాగా ఆర్‌బీఐ కీలక రేపో పాటు తగ్గింపు నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రేట్ల కోత నిర్ణయం అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే ఈ ఫైనాన్స్ కంపెనీ హోమ్ లోన్స్‌పై రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు తగ్గించింది. ఈ రేటు ఆధారంగానే కంపెనీ అందిస్తున్న హోమ్ లోన్స్ వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. 


కాగా ఈ రేట్ల కోత తగ్గింపు కారణంగా ప్లోటింగ్ రుణాలపై వడ్డీ రేటు దాదాపు 8.25 శాతానికి పడిపోయింది. ఇక ఈ గరిష్ట రేటు 8.65 శాతంగా ఉంది. అయితే ఈ రేట్లు వేతనజీవులకు వర్తిస్తాయి. కాగా ఆర్బీఐ ఈ నెల ఆరంభంలో కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లమేర తగ్గించి రెపో రేటు 9 ఏళ్ల కనిష్ట స్థాయికి చేర్చింది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: