తమిళనాడులోని తిరుచ్చిలో లలితా జ్యువెల్లరీ షాపులో భారీ చోరీకి పాల్పడిన కేసును పోలీసులు చేధించారు. 24 గంటల్లోనే చోరీకి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారురుచ్చి గాంధీనగర్‌లోని లలితా జ్యువెలరీ దుకాణంలో మంగళవారం రాత్రి గోడకు కన్నం వేసి చొరబడిన దొంగలు రూ.13కోట్ల విలువైన వజ్రాభరణాలు, బంగారు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటైన 7 స్పెషల్ టీమ్స్ దొంగలు దుక్కొటైలోని ఓ లాడ్జిలో ఉన్నట్లు సమాచారం అందుకుని గురువారం ఉదయం తనిఖీలు చేపట్టారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న దొంగలు లాడ్జి పై అంతస్తు నుంచి దూకి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కింద నక్కివున్న పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేశారు.

పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ దొంగకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతో కేరళ, మహారాష్ట్రకు చెందినవారని.దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు అంతరాష్ట్ర దోపిడీదారుడిని బెంగళూరు బొమ్మనహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.5 కోట్ల విలువ చేసే 12 కేజీల బంగారు, ప్లాటినం నగలు, వజ్రాభరణాలతో పాటు టవేరా కారును స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ భాస్కర్‌రావ్‌ మంగళవారం తెలిపారు. ఈ సొత్తును హోంమంత్రి బసవరాజ బొమ్మైతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమిళనాడు తిరుచనాపల్లి తిరువంబూర్‌కు చెందిన మురుగన్‌(45) అలియాస్‌ బాలమురుగన్, శివకుమార్, శివ తదితర పేర్లతో తిరుగుతూ.. వివిధ రాష్ట్రాల్లో తన అనుచరులతో కలిసి భారీ దోపిడీలకు పాల్పడేవాడు.


తిరుచ్చి లలితా జ్యుయెలరీ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ శాఖలో దోచుకున్న బంగారు ఆభరణా.. ఆభరణాలను తిరుచ్చి నది పక్కన అడవిలో గుంత తవ్వి పూడ్చిపెట్టాడు. ఇటీవల బొమ్మనహళ్లిలో చోటుచేసుకున్న చోరీ కేసులో తీవ్రంగా గాలించిన పోలీసులు మంగళవారం మురుగన్‌ను అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించగా దొంగతనాల చిట్టా విప్పాడు. . కాగా మురుగన్‌ను నాలుగు రోజుల కిందటే బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి బంగారు సొత్తును రికవరీ చేసినట్లు తెలిసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: