ద్విచక్ర వాహనాల చరిత్రలో ఒక మైలు రాయిగా మారీన రోజులవి ఆ రోజులే హమారా బజాజ్ చేతక్ నడుస్తున్న టైం ఆ తర్వాత బ్యాన్ చేయడం కూడా జరిగింది.దేశీ ద్విచక్ర వాహన రంగంలో ఒకప్పుడు రారాజుగా వెలిగి, కనుమరుగైన బజాజ్‌ చేతక్‌ స్కూటర్‌ ఈసారి ఎలక్ట్రిక్‌ వాహనంగా తిరిగొస్తోంది. బజాజ్‌ ఆటో బుధవారం చేతక్‌ ఈ–స్కూటర్‌ను ఆవిష్కరించింది. కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ దీన్ని ఆవిష్కరించారు. అమ్మకాలు జనవరి నుంచి మొదలవుతాయని బజాజ్‌ ఆటో ఎండీ రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. ముందుగా పుణెలో ఆ తర్వాత బెంగళూరులో విక్రయాలు ప్రారంభిస్తామని, స్పందనను బట్టి మిగతా ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. భవిష్యత్‌లో ఉండే అవకాశాలను గుర్తించే ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్లో ముందుగా కాలు మోపుతున్నామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌ అంతా ఎలక్ట్రిక్‌ వాహనాలు, బయో ఇంధనాలు వంటి పర్యావరణ అనుకూల టెక్నాలజీలదేనని గడ్కరీ తెలిపారు. నీతి అయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అధికారికంగా చేతక్‌ ఈ–స్కూటర్‌ రేటు ఎంతన్నది వెల్లడించనప్పటికీ, రూ. 1.5 లక్షల లోపే ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీన్ని ఒక్కసారి 5 గంటల పాటు చార్జింగ్‌ చేస్తే.. ఎకానమీ మోడ్‌లో 95 కి.మీ., స్పోర్ట్స్‌ మోడ్‌లో 85 కి.మీ. మైలేజీ ఇస్తుందని పేర్కొంది. తమ ప్రొ–బైకింగ్‌ డీలర్‌షిప్స్‌ ద్వారా వీటిని విక్రయించనున్నట్లు రాజీవ్‌ బజాజ్‌ చెప్పారు. మహారాష్ట్రలోని చకన్‌ ప్లాంటులో తయారు చేసే చేతక్‌ ఈ–స్కూటర్స్‌ను వచ్చే ఏడాది నుంచి యూరప్‌లోని వివిధ దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు.

హమారా బజాజ్‌...: 1970ల తొలినాళ్లలో ప్రవేశపెట్టిన చేతక్‌ స్కూటర్‌ దేశీ ద్విచక్ర వాహన రంగంలో ఓ సంచలనం సృష్టించింది.ఇప్పుడు వచ్చే ఈ చేతక్ కి ఒక పథకం కింద సబ్సిడీ ద్వారా అందించేంత కొత్త ప్లాన్ ద్వారా కూడా దీన్ని మార్కెట్ లో రారాజు గా మార్చే పనిలో ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: