విపణిలో రోజుకి ఒక కంపెనీ నుండి ఫోన్స్ విడుదల అవ్వడం మాములే . అందులో భాగంగానే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హువావే అదిరిపోయే ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ ను విపణిలోకి  తీసుకువచ్చింది. హువావే ఎంజాయ్ 10 పేరిట ఈ ఫోన్ చైనాలో అధికారికంగా లాంచ్ అవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలిసినవి 48 మెగా పిక్సెల్ కలిగిన డ్యూయల్ కెమెరా, పంచ్ హోల్ సెల్పీ కెమెరాతో కూడిన డిస్ ప్లే కూడా ఉండటం విశేషం ఈ ఫోన్ లో.


ఈ ఫోన్ ను కంపెనీ మూడు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,199 యువాన్లు అంటే సుమారు భారత దేశంలో రూ.12,000 గా ఉండగా, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 6 జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ల ధరను 1,399 యువాన్లు అనగా సుమారు రూ.14,000 గా నిర్ణయించారు. హువావే ఎంజాయ్ ఫోన్ కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు చైనాలో ఇప్పటికే ప్రారంభం అవ్వగా, అమ్మకాలు నవంబర్ ఒకటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ప్రపంచంలోని మిగతా దేశాల్లో ఈ ఫోన్ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయం ఇంకా పూర్తి సమాచారం లేదు. ఈ ఫోన్ యాసిషియా రెడ్, అరోరా బ్లూ, బ్రీతింగ్ క్రిస్టల్, మ్యాజిక్ నైట్ బ్లాక్ రంగుల్లో మొత్తం 4 రంగులలో లభించనుంది.


ఈ ఫోన్లో 6.39 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే కూడా అందుబాటులో ఉంది. పంచ్ హోల్ డిస్ ప్లేతో విడుదలైన దీనిలో స్క్రీన్ టు బాడీ రేషియో 90:15 శాతంగా ఉంది. స్క్రీన్ రిజల్యూషన్ 720x1560 పిక్సెల్స్ గా ఉంది. ఆక్టాకోర్ హై సిలికాన్ కిరిన్ 710ఎఫ్ ప్రాసెసర్ ద్వారా ఈ ఫోన్ పని చేస్తుంది. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా ఫోన్ స్టోరేజ్ని 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇంకా కెమెరా విషయానికి వస్తే, ఇందులో వెనకవైపు 2 కెమెరాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా అపెర్చర్ f/1.8గా ఉంటాది. 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న డెప్త్ సెన్సార్ ను ఫీచర్ కూడా ఇందులో అందించారు. దీని అపెర్చర్ f/2.4గా ఉంటుంది. సెల్పీలు తీసుకోవడానికి, వీడియో కాల్స్ మాట్లాడుకోవడం కోసం ముందువైపు 8 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాను పొందుపరిచారు. దీని అపెర్చర్ f/2.0 గా ఉంది. ఫ్రంట్ కెమెరా ఒక్కటి కాస్త ఇందులో ఒక మైనస్ గా చెప్పుకోవచ్చు.


ఇక ఇందులో బ్యాటరీ సామర్థ్యం 4,000 ఎంఏహెచ్ గా ఉంది. ఫోన్ లో ఉండే ఫైల్స్ ట్రాన్స్ ఫర్ కోసం యూఎస్ బీ పోర్ట్ ను కూడా అందించారు కంపెనీ వారు. అయితే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్న అన్ని ఫోన్లలో ఉన్న ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లను ఇందులో హువావే అందించలేదు. దీనితో కాస్త ఈ ఫోన్ కొనడానికి ఆసక్తి చూపడంలో కష్టమని అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: