దీపావళి రానే వచ్చేస్తోంది. ఈ వీకెండ్‌ లో షాపింగ్ ప్లాన్ చేసుకున్నారా? వారానికి లేదా నెలకు సరిపడా సరుకులు కొందామని వెళ్తున్నారా?  లేదా అలా బోర్ కొడుతుందని షాపింగ్‌కు బయల్దేరుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఎప్పుడు షాపింగ్‌కు వెళ్లినా పర్సులు ఖాళీ అవడం రొటీన్. కానీ ఈ సారి మరి ఈ 9 షాపింగ్ టిప్స్‌తో మీ డబ్బు ఆదా చేసుకోండి. అవిఎంటంటె ఇటు ఒక లుక్ వేయండి... 


1. ముందుగా మీరు షాపింగ్‌కు వెళ్లినప్పుడు లిస్ట్ తప్పనిసరి. ఏమేమీ కావాలో లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్లండి. లిస్ట్‌లో లేదంటే అదనంగా ఏ వస్తువు కొనాలిసిన అవసరం రాదు. విండో షాపింగ్‌కు అలవాటు పడితే చివరకు మీకు కావాల్సిన వస్తువులు కొనలేని పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. అందుకే మీరు రాసుకున్న జాబితాకు మాత్రమే షాపింగ్ చేయండి. 


2. లిస్ట్ రాసుకున్న తర్వాత వాటికి బిల్ ఎంత అవుతుందో అంచనా వేసి అంతకు సరిపడే డబ్బు మాత్రమే తీసుకెళ్లండి. జేబులో తక్కువ నగదు ఉంటే ఎక్కువ ఖర్చు చేయాలనిపిస్తుంది. 


3 మీకు తప్పనిసరిగా వస్తువులు కావాలనుకుంటేనే మాత్రమే షాపింగ్‌ చేయండి. అంతే కానీ ఇంట్లో బోర్ కొడుతుందనో, అలా బయట తిరిగి ఎంజాయ్ చేద్దామనో, సూపర్ మార్కెట్‌ చూసొద్దామనో షాపింగ్‌కు మాత్రం అసలు వెళ్లొద్దు. 


4. మీ భాగస్వామికో, పిల్లలకో షాపింగ్ అంటే అస్సలు ఇష్టం లేదా? అయితే మీ పర్సును కాపాడేది వాళ్లు మాత్రమే. కాబట్టి వారినే వెంట ఖచ్చితంగా తీసుకెళ్లండి. 


5. మీరు కొనాలనుకున్న వస్తువు ధర ఆన్‌లైన్‌లో ఎంతుందో ముందుగానే చెక్ చేసుకోండి. ఆన్‌లైన్‌లో ధర తక్కువగా ఉంటే ఆ ధర చూపించి సూపర్ మార్కెట్‌లో వాళ్లను డిస్కౌంట్ అడగండి. కస్టమర్ ని వదులుకోవడం ఇష్టం లేని షాపు నిర్వాహకులు తప్పనిసరిగా డిస్కౌంట్లు ఇస్తారు.


6. ఆన్ లైన్ లో షాపింగ్ కూడా ఒక డబ్బు ఆదా చేసే మార్గమే. కాకపోతే ఆన్‌లైన్‌లో తెలివిగా కొనడం ఓ నేర్పరితనం. ఆఫర్ల మోజులో పడి అవీ ఇవీ కొనుకొకుండా మీకు కావాల్సిన వస్తువును తక్కువ ధరకు పొందేలా చూసుకోవాలి.


7. మీకు కావాల్సిన వస్తువే అయినా ధర, నాణ్యత విషయంలో అనుమానంతో కొనాలా వద్దా అన్న డైలమా చాలామందిలో కనపడుతుంటుంది. మీరు కానీ అలాంటి డైలమాలో ఉంటే ఆ వస్తువు కొనకపోవడమే మంచిది. కొన్న తర్వాత వస్తువు నచ్చకపోతే మళ్లీ మీరే బాధ పదలిసి వస్తుంది. 


8. ఫెస్టివల్ సేల్స్ నెలనెలా వస్తూనే ఉంటాయి మనకు ఏవేవో ఆఫర్లు వస్తుంటాయి. వాటిని చూసి అట్రాక్ట్ కావాల్సిన అస్సలు అవసరం లేదు. ఎలాంటి సేల్స్ లేని రోజులు కూడా వస్తూ ఉంటాయి. ఆ రోజుల్లో కూడా డిస్కౌంట్లు బాగానే పొందొచ్చు. 


9. అన్నిటికంటే ముఖ్యంగా మార్కెటింగ్ మోజులో పడొద్దు.


ఇలా ప్రతి ఒక్కరు గనుక అలోచించి షాపింగ్ చేయగలిగితే చాలా పొదుపు చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: