బంగారం కొనుగోళ్లకు పవిత్రమైన ‘ధన్‌‌‌‌తేరాస్‌‌‌‌’ రోజు కూడా జ్యూయల్లరీ షాపుల్లో సందడి లేదు. గోల్డ్, జ్యూయల్లరీ అమ్మకాలు ధంతేరాస్‌‌‌‌కి కూడా స్తబ్దుగానే ఉన్నాయి. బంగారం ధర ఎక్కువగా ఉండటంతో ప్రజలు గోల్డ్, జ్యూయల్లరీకి బదులు.. సిల్వర్ కాయిన్లను కొనడానికి మొగ్గుచూపినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెప్పాయి.


 ఇండియాలో ఉత్తర,పశ్చిమ ప్రాంతాల వారు ధంతేరాస్‌‌‌‌ను గోల్డ్, సిల్వర్, ఇతర విలువైన ఆభరణాల కొనుగోళ్లకు ప్రతిష్టాత్మకమైన రోజుగా భావిస్తారు. ఈ ధంతేరాస్‌‌‌‌కు బంగారం దుకాణాల ఆఫర్లతో కస్టమర్లకు స్వాగతం కూడా పలికాయి. కానీ కస్టమర్ల రాక మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. 10 గ్రాముల బంగారం ధర ధంతేరాస్‌‌‌‌కు రూ.39 వేలు పలికింది. గతేడాది ఇదే రోజు ఈ ధర రూ.32,690గా ఉంది.‘కస్టమర్లు రాక అంత ఎక్కువగా లేదు. దేశవ్యాప్తంగా అమ్మకాలు తక్కువగానే ఉన్నట్టు రిపోర్ట్‌‌‌‌లు వచ్చాయి’ అని ఆల్‌‌‌‌ ఇండియా జెట్ అండ్ జ్యూయల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్(జీజేసీ) ఛైర్మన్ అనంత పద్మనాభన్ చెప్పారు.


 కానీ వచ్చే రోజుల్లో పెళ్లి సీజన్ రాబోతుండటంతో, అమ్మకాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  సిల్వర్ కాయిన్ అమ్మకాలపై ఈ సారి పాజిటివ్ ట్రెండ్ ఉందని ఖన్నా జెమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ పంకజ్ ఖన్నా చెప్పారు. గోల్డ్ ధరలు ఎక్కువగా ఉండటంతో, ఈ మెటల్‌‌‌‌ను ప్రజలు ఎక్కువగా కొంటున్నారని తెలిపారు. తమ ఆన్‌‌‌‌లైన్ ప్లాట్‌‌‌‌ఫామ్ ద్వారా 100 కేజీలకు పైగా సిల్వర్ కాయిన్ల అమ్మకాలు జరిగినట్టు పేర్కొన్నారు. గతేడాది ఇదే సమయంలో 23 కేజీల సిల్వర్ కాయిన్లను మాత్రమే అమ్మినట్టు చెప్పారు. 


గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బంగారం అమ్మకాలు 20 శాతం తక్కువగా నమోదైనట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఏడాది బంగారం దిగుమతులు కూడా 12 శాతం వరకు తగ్గాయి. ధంతేరాస్‌‌‌‌ సందర్భంగా జ్యూయల్లరీ కంపెనీల షేర్లు కూడా నిరాశపర్చాయి.  దేశీయ కమోడిటీ మార్కెట్లలో గోల్డ్, సిల్వర్‌‌‌‌‌‌‌‌లు కూడా ఫ్లాట్‌‌‌‌గా ట్రేడయ్యాయి. ఎంసీఎక్స్ గోల్డ్(డిసెంబర్) ఫ్యూచర్స్ 0.09 శాతం తగ్గి రూ.28,319 వద్ద, ఎంసీఎక్స్ సిల్వర్(డిసెంబర్) ఫ్యూచర్స్ 0.23 శాతం పెరిగి రూ.46,100 వద్ద ట్రేడయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: