బంగారం ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. ఈ బంగారం ధరలు తగ్గడం చూసి ప్రస్తుతం అందరూ షాక్ కు గురవుతున్నారు. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 0.27 శాతం తగ్గి రూ. 38,475కు చేరుకుంది. కాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 0.25 శాతం తగ్గి 36,302కు చేరుకుంది. కాగా గత వారం బంగారం ధర 1.31 శాతం పెరిగి పసిడి ప్రియులందరికీ షాక్ ఇచ్చింది. 

                           

ఇప్పుడు ఒకేసారి ఇంత తగ్గడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర 0.30 శాతం తగ్గి రూ.46,635కు చేరుకుంది. అయితే గతవారం 1.5 శాతం పెరిగి అందరికి షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ తగ్గడంతో ఇలా బంగారం ధర పడిపోయింది అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. 

                         

కాగా గతవారం ధన్‌తెరాస్, దీపావళి పండుగలు రావడంతో అమ్మకాలు భారీగా పెరుగుతాయని బంగారం ధర భారీగా పెరిగింది. అయితే ఈసారి ధరలు ఆకాశాన్ని తాకడంతో పసిడి ప్రేమికులు పండగకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే గత సంవత్సరంలో ఈ పండుగలకు భారీగా అమ్మకాలు జరిగాయి. దీంతో ఈసారి అలానే ఉంటుంది అని ఉహించగా పెద్దగా ఉపయోగం లేకపోయింది. 

                     

మరింత సమాచారం తెలుసుకోండి: