ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్ డొనాల్డ్.. సంస్థ సీఈఓ స్టీవ్ ఈస్ట బ్రూక్ ని తొలగించడం జరిగింది. మెక్ డొనాల్డ్ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగితో వ్యక్తిగత సంబంధాలు(రొమాంటిక్ రిలేషన్‌షిప్) జరుపుతున్నారని వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలియచేసింది. సహచరులకు రాసిన లేఖలో స్టీవ్ తనపై ఉన్న ఆరోపణల్ని ఒప్పుకోవడం జరిగింది. ఇది సంస్థ నిబంధనలకు విరుద్ధమని అందుకే కంపెనీ నుంచి వైదొలగడానికి నిర్ణయించుకున్నాని చెప్పారు. “కంపెనీ విలువలననుసరించి బోర్డు నిర్ణయించిన ప్రకారం నేను తొలగిపోవాల్సిన సమయం ఆసన్నమైంది" అని లేఖలో స్టీవ్ తెలియచేయడం జరిగింది.


స్టీవ్ పై ఉన్న ఆరోపణలపై మెకొనాల్డ్ బోర్డు లోతైన సమీక్షజరపడం కూడా జరిగింది. స్టీవ్ ని కంపెనీ నుంచి పంపేయాలన్న - తీర్మానానికి సభ్యులంతా అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. మెక్ డొనాల్డ్ కంపెనీ బోర్డు నుంచి కూడా  సీఈఓని  తొలగించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయనకు చెల్లించాల్సిన ప్యాకేజీ వివరాలను సోమవారం తెలియచేస్తాము అని  సంస్థ ప్రతినిధి వెల్లడించింది. నూతన సీఈఓగా అమెరికా మెక్ డొనాల్డ్ అధ్యక్షుడిగా పనిచేసిన క్రిస్ కెంపీజీ జిన్స్క పేరును బోర్డు సభ్యులు తెలియచేయడం జరిగింది.


మూడో త్రైమాసికంలో మెక్ డొనాల్డ్ నికర ఆదాయం రెండు శాతం మేర కూడా తగ్గడం జరిగింది. స్టోర్ల రీమోడలింగ్, డెలివరీ సేవల్ని విస్తరించడం వల్లే తగ్గుదల నమోదైందని సంస్థ తెలియచేయడం జరిగింది. దీంతో కంపెనీ షేరు ధర 1.5శాతం మేర పడిపోయింది.

అయినా, ఈ సంవత్సరంలో 9.2శాతం లాభంతోనే ముందుకు దూసుకెళ్తుండడం మాత్రం చాల  గమనార్హం. అయితే నాయకత్వ మార్పు.. సంస్థ ఆర్థికపరమైన విషయాలపై ఎలాంటి ప్రభావం చూపదని కంపెనీ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: