భారత్ రైల్వే ప్రయాణికులు ఇది శుభవార్త అనే చెప్పాలి. తన ప్రయాణికులకు విన్నూత సేవలు అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫిట్ ఇండియా కార్యక్రమం లక్ష్యాలను చేరుకునేందుకు రైలు ప్రయాణం చేసే వారి కోసం రైల్వే స్టేషన్ లోనే హెల్త్ ఏటీఎంలను ఏర్పుటు చేస్తుంది. 


ఇప్పటికే ఈ హెల్త్ ఎటిఎంలు ఇండియన్ రైల్వేస్ లక్నో రైల్వే స్టేషన్‌లో రెండు ఏర్పాటు అయ్యాయి. దాదాపు 16 హెల్త్ చెకప్‌ సర్వీసులు ఈ హెల్త్ ఏటీఎం ద్వారా పొందవచ్చు. అయితే ఈ 16 హెల్త్ చెకప్‌ సర్వీసుల కోసం కేవలం రూ.50-రూ.100 చెల్లిస్తే చాలు సరిపోతుంది. అయితే ఇందులో రెండు రకాల హెల్త్ చెకప్ లు ఉన్నాయి. ఒక హెల్త్ చెకప్  కి 9 నిమిషాలు.. మరో చెకప్ కి 9 నిముషాలు కేటాయిస్తే సరిపోతుంది.  


అయితే ఈ హెల్త్ చెకప్ రిపోర్ట్ వెంటనే మెయిల్ కి వస్తుంది. ఈ హెల్త్ చెకప్ ద్వారా జ్వరం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటె వెంటనే తెలుసుకోవచ్చు.. ఇప్పుడు కేవలం లక్నోలో మాత్రమే ఉన్న ఈ హెల్త్ చెకప్ త్వరలో అన్ని స్టేషన్ లలో వస్తాయి అని దీంతో ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది అని యోలో హెల్త్ ఏటీఎం స్టేట్ హెడ్ అమ్రేశ్ ఠాకూర్ చెప్పారు. అయితే అతి తక్కువ ధరకే ఎన్నో చెకప్ స్ ఇందులో వచ్చ్చే అవకాశాలు ఉన్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: