కేంద్ర ప్రభుత్వం కార్మికులకు, ఉద్యోగులకు మంచి ప్రయోజనం రావడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకు అనుగుణంగా డ్రాఫ్ట్ వేజ్ కోడ్‌ను విడుదల చేయడం జరిగింది. దీంతో అంశాలలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత పలు మార్పులతో కొత్త నిబంధనలు అన్ని కూడా  అమలులోకి వస్తాయి అని అధికారులు తెలుపుతున్నారు. 


ఇక ఉద్యోగులకు మాత్రం మంచి శుభ వార్త ఇస్తుంది. లేబర్ అండ్ ఎంప్లాయి‌మెంట్ మంత్రిత్వ శాఖ కార్మిక చట్టాలను సరి చేయడం మొదలు పెట్టింది. దీని కోసం ఇప్పటికే ఒక డ్రాఫ్ట్ కోడ్‌ను విడుదల చేయడం జరిగింది. కోడ్ ఆఫ్ వేజెస్ 2019లోని సెక్షన్ 67 కింద వీటిని జారీ చేయడం జరిగింది. డ్రాఫ్ట్‌ కోడ్‌పై ప్రజా అభిప్రాయాలను కూడా తెలుసుకుంటుంది.


ఈ కొత్త రూల్స్ అమలైతే వీటిని కోడ్ ఆఫ్ వేజెస్ (సెంట్రల్) రూల్స్ 2019 అని తెలియచేసారు. డ్రాఫ్ట్ కోడ్ ఆన్ వేజెస్ 2019లో వీక్లీ ఆఫ్, నైట్ షిప్ట్‌ల ప్రస్థావన కూడా లభించింది. వీటి గురించి డ్రాఫ్‌ కోడ్ ఏం తెలియచేస్తుందో చూద్దామా మరి.. నైట్ షిఫ్ట్ చేసే వారు 24 గంటల వీక్-ఆఫ్‌ను పొందవచ్చు. షిఫ్ట్ ముగిసిన వెంటనే ఇది మొదలు అవుతుంది.


ఉద్యోగుల డ్యూటీ టైమ్ అర్ధరాత్రి దాటిపోతే అప్పుడు వారిని నైట్ షిప్ట్ కిందకు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఉద్యోగులు  వీక్ ఆఫ్ రోజు అసలు పనిచేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు  చేత వరుసగా పది రోజులు పనిచేయించకూడదు. మధ్యలో తప్పనిసరిగా రెస్ట్ డే ఉండాలి. ఉద్యోగులు రెస్ట్ డే లేదా వీక్ ఆఫ్ రోజు పనిచేస్తే దీనికి కూడా వేతనం ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: