ప్రత్యేకంగా  గోల్డ్ స్కీమ్ గురించి ఎవరికి  చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మందికి  గోల్డ్ స్కీమ్ గురించి తెలిసే అవకాశం ఉంటుంది. కానీ  వీటిల్లో డబ్బు దాచుకోవడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. జువెలరీ సంస్థ దివాలా తీస్తే మీరు ఎలాంటి ప్రయోజనులు కూడా పొందలేరు. ఇక  దేశంలో చాలా జువెలరీ సంస్థలు ఉన్నాయి. ఇవి గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్‌ను అందిస్తూ చాల ప్రకటనలు కూడా ఇస్తూ ఉంటాయి.

ఇందులో ప్రతి నెలా డబ్బులు కట్టవలసి వస్తుంది. మీ కట్టిన డబ్బులకు సమానమైన బంగారం మీ అకౌంట్‌లో జమవుతుంది. లేదంటే 11 నెలలు డబ్బులు చెల్లించిన తర్వాత ఆ డబ్బుతో జువెలరీ సంస్థకు వెళ్లి బంగారు ఆభరణాలు కొన్నుకోవాల్సి వస్తుంది. ఇక్కడ 12 నెల డబ్బులను జువెలరీ సంస్థ మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.


ఎక్కడైనా  బంగారు స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు చాలా విషయాలను గమనించు కోవాల్సి ఉంటుంది. తాజాగా  ముంబైలో గుడ్‌విన్ జువెలర్స్ అనే సంస్థ జువెలరీ సంస్థ బోర్దు తిప్పేయడం కూడా జరిగింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఇలా చేయడం వల్ల చాల మంది నష్టపోవాల్సి వచ్చింది.


ముఖ్యంగా గోల్డ్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల దివాలా సమస్య ఎదురైతే డబ్బు డిపాజిట్ చేసిన వారికి ఎలాంటి రక్షణ కూడా ఇవ్వదు  జువెలరీ సంస్థ. ఈ డిపాజిట్లు సాధారణంగా రూ.లక్షకు లోపే ఉంటాయి. కానీ  స్కీమ్ డిపాజిట్ విలువ రూ.100 కోట్లు దాటితేనే అది కలెక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ కిందకు వస్తుందని సెబీ తెలియచేయడం జరిగింది. అంతేకాకుండా కంపెనీలు ఇలాంటి స్కీమ్స్‌ను ఆఫర్ చేయాలంటే ముందుగా సెబీ అనుమతి కచ్చితంగా తీసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: