కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లించేవారికి తీపికబురు అందించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) విశిష్ట డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ సేవలు అందుబాటులోకి ఇప్పుడు వచ్చాయి. దీంతో ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో పారదర్శకత, జవాబుదారీతనం వంటివి పూర్తిగా పెరగనున్నాయి. ప్రస్తుతం వస్తు సేవల పన్ను (GST), కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ వంటి పన్నులు చెల్లించేవారు వారి ట్యాక్స్ నోటీసులను ఒకటికి రెండు సార్లు  సరిచూసుకోవచ్చు. దీనితో పన్ను నోటీసులు నిజమో కాదో తెలుసుకోవచ్చు. మెమో సెర్చ్ ఫెసిలిటీ కూడా ఇందులో ఉంది. మొదటి సారిగా ఈ సేవలు ఐటీ డిపార్ట్‌మెంట్‌కు అందుబాటులోకి వస్తాయి.


సెర్చ్ అండ్ అరెస్ట్ నోటీసులు వంటి ఇన్వెస్టిగేషన్ సంబంధిత అంశాల కోసం మొదటగా ఈ విశిష్ట డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (CBIC - DIN) ను ఉపయోగిస్తారు. ఈ ఏడాది చివరకు ఇతర అంశాలకు కూడా ఈ సేవలను జత పరుస్తారు. డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్స్‌పేయర్స్‌ కు కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. నవంబర్ 8 లేదా ఆపైన విడుదల అయ్యే నోటీసుల పై కంప్యూటర్ జనరేటెడ్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లేకపోతే అవి చెల్లుబాటుల కావు అని సీబీఐసీ ఈ ముఖంగా తెలిపింది. డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (DIN) అమలులోకి రావడంతో ప్రత్యక్ష, పరోక్ష పన్ను చెల్లింపుదారులు వారికి వచ్చే నోటీసులు నిజమో కాదో తెలుసుకోవచ్చని తెలిపింది. 


కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఇప్పటికే డీఐఎన్ విధానాన్ని అమలు జరుపుతోంది. అక్టోబర్ 1 నుంచి ఇది అమలులోకి కూడా వచ్చింది. ఇకపోతే సీబీఐసీ డీఐఎన్ అమలుకు సంబంధించి ప్రిన్సిపల్ కమిషనర్స్, ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్స్, చీఫ్ కమిషనర్స్, డైరెక్టర్ జనరల్స్, ప్రిన్సిపల్ కమిషనర్స్, ప్రిన్సిపల్ ఏడీజీ, జాయింట్ సెక్రటరీస్, కమిషనర్ల అందరికి ఆదేశాలు జారీ చేసింది.


నిజాయితీతో పన్ను చెల్లించే వారిని ట్యాక్స్ అధికారుల వేధింపుల నుంచి రక్షించేందుకు కేంద్రం ఈ కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. సీబీడీటీ, సీబీఐసీ నుంచి వెలువడే అన్ని డాక్యుమెంట్లకు  ఖచ్చితమైన ఆడిట్ ట్రయల్ ఉంటుంది. అంటే సీబీఐసీ డీఐఎన్‌లో మొత్తం 20 నెంబర్లు ఉంటాయి. డాక్యుమెంట్‌ పై ఇది స్పష్టంగా కనిపిస్తుంది. సీబీడీటీ డీఐఎన్‌లో 10 నెంబర్లు ఉంటాయి, ఇది కేవలం అధీకృత అధికారులు మాత్రమే సీబీడీటీ డీఐఎన్, సీబీఐసీ డీఐఎన్ నెంబ్లను జనరేట్ చేయగలరు. నవంబర్ 8 నుంచి సీబీఐసీ డీఐఎన్ నెంబర్ అమలులోకి వచ్చినా, ఇక సీబీడీటీ డీఐఎన్ నెంబర్ విధానం మాత్రం అక్టోబర్ 1 నుంచే అమలులో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: