ప్రపంచాన్ని ఏది నడిపిస్తుంది అంటే టక్కున అధిక శాతం మంది ఇచ్చే సమాధానం డబ్బులు. అయితే డబ్బు సంపాదించాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా కోటీశ్వరులు కావొచ్చు అని అందరూ అనుకుంటారు. అయితే దీనికి చాలా సహనం కావాలి. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్మెంట్లను ఉంచాలి. దీనికి ఆర్థిక క్రమశిక్షణ కూడా అవసరం. ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి.


ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల ప్రకారం చూస్తే సిప్ మార్గంలో మ్యూచువల్ ఫండ్స్‌ లో ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి పది శాతం రాబడి పొందొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌ లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది మనకి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో సంవత్సరానికి పన్నెండు శాతం రాబడి ఆశించొచ్చని ట్రాన్సెండ్ కన్సల్టెంట్స్ వెల్త్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ కావేరీ ఝవేరీ ఒక ప్రకటనల్లో తెలిపారు. అదే పదహేను ఏళ్ల కాలపరిమితితో చూస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో 15 % రాబడి పొందొచ్చని పేర్కొన్నారు.


మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇరవై ఏళ్ల పాటు సిప్ రూపంలో నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేయడం వల్ల 15 శాతం రాబడి వస్తుందని అంచనా వేస్తే, అప్పుడు మెచ్యూరిటీ మొత్తం రూ.60,02,682 అవుతుంది. అదే మీరు ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్‌మెంట్‌ ను 10 శాతం వరకు పెంచుకుంటూ వెలితే అప్పుడు మెచ్యూరిటీ మొత్తం రూ.1.12 కోట్లకు చేరుతుంది.


అయితే ఇక్కడ సంవత్సరానికి 10 శాతం స్టెప్ అప్‌ తో సిప్ అమౌంట్ పెరుగుతూ వెళుతుంది. స్టార్టింగ్‌ లో పర్వాలేదు అనిపించినా కూడా తర్వాత కొంత కాలానికి ఇది భారం కాకపోవచ్చు. అందువల్ల స్టెప్ అప్ నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి. అలాగే 10 శాతానికి పైన ఎట్టి పరిస్థితుల్లోనూ స్టెప్ అప్ చేయవద్దు.


మరింత సమాచారం తెలుసుకోండి: