టాప్ మేనేజ్‌మెంట్ అనైతిక విధానాలకు పాల్పడుతోందని గుర్తు తెలియని ఉద్యోగులు చేసిన ఆరోపణలపై ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని ఇటీవల స్పందిస్తూ... స్వయంగా దేవుడే దిగి వచ్చినా తాము తప్పుడు లెక్కలు రాయబోమని వ్యాఖ్యానించారు. కంపెనీ ప్రక్రియ అంత బలంగా ఉంటుందని చెప్పారు. విజిల్ బ్లోయర్స్ చేసిన ఆరోపణలు అవమానకరమైనవన్నారు.

అయితే ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని, దీనిపై తమ అభిప్రాయాలను రుద్దే ప్రసక్తి మాత్రం లేదన్నారు. అయితే నందన్ నీలేకని వ్యాఖ్యలపై సెబి చైర్మన్ స్పందించారు. ఇన్ఫోసిస్ విజిల్ బ్లోయర్స్ ఫిర్యాదులపై దర్యాఫ్తు జరుగుతోందని సెబి చైర్మన్ అజయ్ త్యాగీ అన్నారు.నందన్ నీలేకని వ్యాఖ్యలపై స్పందించమని కోరగా... దేవుడిని అడగండి లేదా ఆయననే అడగాలని త్యాగీ అన్నారు.ఇన్వెస్టర్లు సొంతగానే ఓ నిర్ణయానికి రావాలని, మేం ఏం చేయాల్సి ఉంటుందో ఆ పని చేస్తున్నామన్నారు.


ఏమి తేలుతుందో ఆ విషయం మీకు తెలుస్తుందని చెప్పారు.అమెరికాలో కూడా ఇన్ఫోసిస్ నమోదయిందని, అక్కడి నియంత్రణ సంస్థతోను సమాచారం పంచుకుంటున్నారా అడగగా.. అది రెండు నియంత్రణ సంస్థల విషయమని, గోప్యత పాటించాల్సి ఉంటుందన్నారు.ఇన్ఫోసిస్ లెక్కలు సరైనవా కావా అనే విషయంలో మా విచారణ కొనసాగుతుందని, నందన్ నీలేకని అలా అంటే మాత్రం ఆయనను అడగండి లేదా దేవుడిని అడగండన్నారు.


దేవుడే చెప్పినా మా లెక్క తప్పదని, సంస్థ లావాదేవీల్లో గానీ, ఆరోపణలపై దర్యాప్తు విషయంలో గానీ తమ అంచనాల పద్దతులు తప్పవని స్పష్టం చేశారు. సంస్థ టాప్ మేనేజ్మెంట్‌పై ప్రజావేగుల ఫిర్యాదులు అవమానకరం అని సంస్థ ఇన్వెస్టర్ల భేటీలో పేర్కొన్నారు. వ్యవస్థాపకులు, మాజీ ఉద్యోగులపై ఆరోపణలు హేయమైనవన్నారు.అంతా ఎంతగానో గౌరవించే వ్యక్తుల ప్రతిష్టను మసకబార్చే లక్ష్యంతో చేస్తున్నవి. సంస్థకు జీవితాంతం సేవలు అందించిన మా సహ–వ్యవస్థాపకులంటే నాకెంతో గౌరవం. వారు కంపెనీ వృద్ధి కోసం నిస్వార్థంగా కృషి చేశారు. భవిష్యత్‌లోనూ కంపెనీ శ్రేయస్సు కోసం పాటుపడేందుకు కట్టుబడి ఉన్నారు‘ అని నందన్ నిలేకని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: