మన దేశం లో ఒక కేజీ పీత ధర మహా అంటే వేయి లేకపోతే రెండు వేల రూపాయలు అవుతుంది. కానీ జపాన్ లోని టోట్టోరి అనే నగరంలో జరిగిన వేలం పాటలో స్నో క్రాబ్ అనే 1.2 కేజీల పీత ఏకంగా 32 లక్షల 66 రూపాయలకు అమ్ముడుపోయింది. పురాతన వస్తువులని ఎక్కువ ధరలకు కొనడం మనం చూసాం కానీ కేవలం ఓ పీతాని అది కూడా ఒక్క కేజీ 200 గ్రాములున్నది 32 లక్షలకు బంగారంలా అమ్ముడుపోయిందంటే ఆశ్చర్యకపోక తప్పదు. మనమే కాదు జపాన్ ప్రభుత్వం కూడా ఈ స్నో క్రాబ్ అంత ధర పలకడంతో షాక్ అయ్యారు. 


దీంతో ఆ మంచు పీత(స్నో క్రాబ్) ప్రపంచంలోనే అత్యంత ఖరీదేనా పీతగా రెకార్డుకెక్కింది. ఈ పీత మంచులో నే కనిపిస్తుందట. అందుకే ఈ స్నో క్రాబ్ కి ఆ పేరు వచ్చింది. ప్రతియేటా జపాన్ లో శీతాకాలంలో ట్యూనా, పుచ్చకాయలు పై వేలం పాట జరుగుతుంది. జపాన్ ప్రజలు ఈ వేలం పాటని ఎంతో ఆసక్తిగా చూస్తారు ఎందుకంటే అక్కడ ఎవరు ఉహించలేనంత ధరతో చేపలు అమ్ముడుపోతాయి. 


ఇంతకీ ఈ 1.2 కేజీల 14.6 సెంటీమీటర్లు పీతను సొంతం చేసుకున్నది ఎవరంటే స్థానిక దుకాణదారుడు హమాషిత. జపాన్‌లోని గ్లిట్జీ గింజా డిస్ట్రిక్ట్‌లో ఉన్న అత్యంత కాస్ట్‌లీ రెస్టారెంట్‌లో దీన్ని వండి వడ్డించారట. ఫస్టు రోజే మొట్టమొదటి గా పట్టుకున్న పీతని కొనడం ఒక ప్రతిష్టగా భావిస్తారు ఈ జపనీయులు. గత సంవత్సరం కూడా ఒక పీత రూ. 13 లక్షలకు అమ్ముడుపోయి గిన్నిస్ వరల్డ్ బుక్ లోకి ఎక్కింది. ఈ ఏడాది జనవరిలో ఒక పారిశ్రామికవేత్త ట్యూనా చేపని రూ .22 కోట్లు పెట్టి కొన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: