ఖాతాదారులకు మరింత స్వాతంత్ర్యం ఇస్తూ, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) ఇప్పుడు ఒక కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది, దీని ద్వారా మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యుఎఎన్) ను మీ స్వంతంగా ఆన్‌లైన్‌లో జనరేట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు, EPF ఖాతాదారునికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే, ఉద్యోగి సంతకం చేసిన సంబంధిత ఫారాలను యజమాని పొందిన తరువాత యజమాని ఆ ఫారాలను ఈపీఎఫ్ఓ ​​కి సమర్పించాలి మరియు ఈపీఎఫ్ఓ UAN ను ఉత్పత్తి చేయాలి, ఆ యూఏఎన్ ఉద్యోగికి అందచేయబడుతుంది.


కానీ ఇప్పుడు మీరు మీ యజమాని జోక్యం లేకుండా మీ స్వంతంగా యూఏఎన్ ను ఉత్పత్తి చేయవచ్చు. మీ జీవితాంతం యూఏఎన్ సంఖ్య ఒకే విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఒకటి కంటే ఎక్కువ యూఏఎన్ ను కలిగి ఉండరని గుర్తుంచుకోండి. ఉద్యోగాలు మారుతున్న సమయంలో, మీ మునుపటి ఈపీఎఫ్ బ్యాలెన్స్ క్రొత్త ఖాతాకు బదిలీ కావడానికి మీరు మీ యూఏఎన్ ను కొత్త యజమానితో పంచుకోవాలి.


క్రొత్త యూఏఎన్ ను రూపొందించడానికి, మీరు సభ్యుల సేవల కోసం ఈపీఎఫ్ ​​యొక్క ఏకీకృత పోర్టల్‌కు వెళ్లి, పేజీ యొక్క కుడి దిగువ భాగంలో ఉన్న 'డైరెక్ట్ అల్లాట్మెంట్ అఫ్ యూఏఎన్' పై క్లిక్ చేయాలి. ఇప్పటికే యూఏఎన్ కలిగి ఉన్నవారు "మీ యూఏఎన్ స్థితిని తెలుసుకోండి" పై క్లిక్ చేసి మీ యూఏఎన్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు. క్రొత్త యూఏఎన్ ను ఉత్పత్తి చేసే వారిని వెబ్సైట్ మరో పేజీకి తీసుకువెళుతుంది, అక్కడ వినియోగదారులు వారి ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్ మరియు క్యాప్చా కోడ్‌ను అందించాల్సి ఉంటుంది. యుఎఎన్ ఆధార్ లింక్డ్ సౌకర్యం కాబట్టి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉన్న ఆధార్ కార్డ్ హోల్డర్లు మాత్రమే ఈ సదుపాయాన్ని ఉపయోగించడానికి అర్హులు.


వినియోగదారుడి యొక్క గుర్తింపును నిర్ధారించడానికి ఓటీపీ రిజిస్టర్డ్ నంబర్‌కు పంపబడుతుంది, ఆ తరువాత యూఏఎన్ ఉత్పత్తి చేయబడి మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: