జియో తన వినియోగదారులకు ఈ మధ్యనే కొత్త ప్లాన్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ టాప్ గేర్‌లో దూసుజెళ్తున్న జియో ఈ సారి కస్టమర్లకు చుక్కలు చూపించాలని నిర్ణయుంచినట్టుంది. అన్లిమిటెడ్ ఫ్రీ అంటూ కస్టమర్లను ఆకటున్నకున్న జిఓ మెల్ల మెల్ల గా తన ప్లాన్స్ మార్పులు చేర్పులు చేస్తుంది.ఇప్పుడు తాజాగా జియో ఆల్ ఇన్ వన్ రీచార్జ్ లలో మరొక మార్పు  ప్రకటించింది.


జియో ప్లాన్లలో రోజురూ.149 ప్రీపెయిడ్‌ ప్యాక్‌ కి  ఫుల్ డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో ఇస్తున్న గట్టిపోటీని తట్టుకునేందుకు ఎప్పటికపుడు వ్యూహాలను మారుస్తున్న మరో దిగ్గజ టెలికాం ఆపరేటర్‌ భారతి ఎయిర్‌టెల్‌ తాజాగా తన రీచార్జ్‌ప్లాన్‌ మళ్లీ సవరించింది. రూ.149 ప్రీపెయిడ్‌ ప్యాక్‌పై వినియోగదారులకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో ఇకపై ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటాతోపాటు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.

అలాగే 300 నిమిషాల జియో టు నాన్ జియో కాల్స్ వస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ గతంలో 28 రోజులు ఉండగా ఇప్పుడు దీన్ని 24 రోజులకు తగ్గించారు. ఒక విధంగా ఇది జియో కస్టమర్లకు చేదు వార్తే అని చెప్పాలి.నెలకు 30 రోజులు కాగా.....28 రోజుల ప్లాన్ వాడుకున్న కస్టమర్లు 2 రోజులని పెద్దగా లెక్క చేయలేదు.నెలకొకసారి రేఛార్జ్ చేసుకుంటే సరిపోతుందిలే అనుకున్నారు.

కానీ 24 రోజుల వాలిడిటీ తో నెలకి వారం  రోజుల తేడా వస్తుంది.దీనిపై కస్టమర్ల నుండి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇపుడు జియో కొత్త ప్లాన్ తో 3 వారలు తిరిగే సరికి మళ్ళి రీఛార్జ్ అంటే కష్టమే.అలాగే ఈ ప్లాన్‌ను జియో ఆలిన్ వన్ సెక్షన్‌కు తరలించింది. దీంతో ఆ విభాగంలోనే ఇకపై ఈ ప్లాన్ కస్టమర్లకు దర్శనమివ్వనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: