ఆధునిక కాలంలో ఎవరి వద్ద ఇంధనం ఉంటే.. వాడే ధనవంతుడు.. అందుకే గల్ఫ్ దేశాలు మిగిలిన ఉత్పత్తి ఏమీ చేయకపోయినా కేవలం చమురు బావులతోనే ధనవంతమైన దేశాలయ్యాయి. అలాంటి దేశాల్లో ఒకటైన ఇరాన్ ఇప్పుడు పండుగ చేసుకుంటోంది. ఎందుకంటే.. ఆ దేశానికి భారీ చమురు నిల్వలు దొరికాయి.


ఇరాన్ లో ఉన్న కుజెస్థాన్ ఫ్రావిన్స్ లో ఉంది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహనీ స్వయంగా వెల్లడించారు. 53 బిలియన్ బ్యారెన్ల చమురు నిల్వను కల్గి ఉన్న ఈ క్షేత్రం 80 మీటర్ల లోతులో ఉంది. ఇరాక్ సరిహద్దుకు 200 కిలోమీటర్ల దూరంలో కుజెస్థాన్ ఫ్రావిన్స్ లోని ఒమిదేయా నగరానికి సమీపంలో ఈ క్షేత్రం ఉంది.


ఈ కొత్త చమురు నిల్వతో ఇరాన్ లో చమురు నిల్వలను మూడు రెట్లు పెరుగుతాయి. ఇప్పటికే ఇరాన్ చమురు నిల్వల్లో ప్రపంచంలో నాలుగో పెద్ద దేశంగా ఉంది. గ్యాస్ నిల్వల్లో రెండో పెద్ద దేశంగా ఉంది. ఈ కొత్త చమురు నిల్వల వార్త తెలిసి ఆ దేశంలో పండుగ వాతావరణం నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: