దేశీయ ఇంధన ధరలు మిశ్రమంగా స్పందించాయి. సోమవారం పెట్రోల్ ధర పెరిగితే, డీజిల్ ధర మాత్రం తగ్గింది. పెట్రోల్ 16 పైసలు పెరగగా, డీజిల్ ధర మాత్రం 7 పైసలు దిగొచ్చింది. దీనితో హైదరాబాద్‌ లో లీటరు పెట్రోల్ ధర రూ.77.90 కు చేరింది. డీజిల్ ధర రూ.71.86 కు తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడి చమురు ధరలు కొద్దిగా క్షీణించాయి.


ఏపీ రాజధాని అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 15 పైసలు పెరుగుదలతో రూ.77.51 కు వచ్చి చేరింది. డీజిల్‌ ధర 7 పైసలు తగ్గుదలతో రూ.71.16కు చేరింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 15 పైసలు పెరుగుదలతో రూ.77.14 కు పెరిగింది. డీజిల్ ధర 7 పైసలు తగ్గుదలతో రూ.70.82 కు తగ్గింది.


ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 15 పైసలు పెరగడంతో రూ.73.20 కు చేరింది. డీజిల్ ధర 6 పైసలు తగ్గుదలతో రూ.65.85 కు క్షీణించింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే కనిపిస్తోంది. పెట్రోల్ ధర 15 పైసలు పెరుగుదలతో రూ.78.87 కు చేరింది. డీజిల్ ధర 6 పైసలు తగ్గుదలతో రూ.69.07 కు తగ్గింది.


అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.78 శాతం తగ్గుదలతో 62.12 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.54 శాతం క్షీణతతో 56.92 కు చేరింది. ఇకపోతే పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ ఉంటాయి. ఈ పరిస్థితులలో ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరోక రోజు తగ్గొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: