బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ అందించనుంది. ఇప్పటికే ఎన్నో గుడ్ న్యూస్ లు, షాక్ లు ఇచ్చిన కేంద్రం ఇప్పుడు మరో గుడ్ న్యూస్ చెప్పాలని ఆలోచిస్తుంది. ఈ ఈనేపథ్యంలోనే అన్ని ఫైనాన్షియల్ ఇన్‌స్టిటయూషన్లను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. 


ఏది మాత్రమే కాదు బ్యాంక్ డిపాజిట్లపై ఇన్సూరెన్స్ మొత్తాన్ని కూడా పెంచాలని ఆలోచిస్తుంది. ఇందుకు సంబంధించిన పలు నివేదికలు కూడా వెలువడనున్నాయి. ముంబై నిలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పంజాబ్ అండ్ మహరాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ ఉదంతం నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా అడుగులు వేయనుందని సమాచారం. 


కాగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అంశంపై కూడా రివ్యూ జరిగింది. ఇన్సూరెన్స్ కవరేజ్‌ను రూ.లక్ష నుంచి ఆమోదయోగయమైన స్థాయికి పెంచాలనే ప్రతిపాదన ఉందని అడ్మినిస్ట్రేషన్‌లోని ఓ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇన్సూరెన్స్ కవరేజ్ రూ.30,000గా ఉండగా 1993 నుంచి డిపాజిట్లకు రూ.లక్ష ఇన్సూరెన్స్ కవరేజ్ కొనాగుతుంది.


డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ బ్యాంక్ డిపాజిట్లకు రూ.లక్ష వరకు ఇన్సూరెన్స్ కవర్ అందిస్తోంది. అయితే సదురు బ్యాంక్ ఆ డీఐసీజీసీ పరిధిలో ఉంటేనే ఈ ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం రూ.100 డిపాజిట్‌కు 10 పైసల డీఐసీజీసీ ప్రీమియం వసూలు చెయ్యగా అన్ని బ్యాంకులకు ఇదే వర్తిస్తుంది. 2005 ఏప్రిల్ నుంచి ఈ ప్రీమియం అమలులోకి వచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: