ఇప్పుడు ఎవరిని చూసినా.. ఏం కొనాలన్నా బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఏదైనా ఆన్ లైన్ లోనే. చాలా వరకూ వస్తువులు ఆన్ లైన్ లోనే కొనేస్తున్నారు. దీంతో ఈ-కామర్స్ బిజినెస్ అమాంతం పెరిగిపోయింది. దీనికి తోడు అనేక సంస్థలు ఆఫర్ల పేరుతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.


తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా సాధించిన రికార్డులే ఇందుకు ఓ ఉదాహరణ. ఈ సంస్థ అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. అర్ధరాత్రి నుంచి సింగిల్స్ డే పేరిట ఆన్ లైన్ లో 3వేల 182కోట్ల డాలర్ల మేర అమ్మకాలు జరిపింది. గత ఏడాది ఇదే రోజు 3వేల 80కోట్ల డాలర్ల విక్రయాలు జరిపింది.


ఇప్పుడు ఆ రికార్డు బద్దలై కొత్త రికార్డు వచ్చేసింది. సేల్స్ ప్రారంభమైన 16 గంటల 33 నిమిషాలకు ఆర్డర్లు వంద కోట్లను దాటినట్లు అలీబాబా సంస్థ ప్రకటించింది. అవును మరి జనం అంతా ఆన్ లైన్ పై ఎగబడుతుంటే రికార్డులు బద్దలు కాకుండా ఉంటాయా..!


మరింత సమాచారం తెలుసుకోండి: