సాధారణంగా యూట్యూబ్, గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు... కొత్త రూల్స్ ప్రవేశ పెట్టినప్పుడు దాదాపు 15 నుంచీ 20 పేజీల కండీషన్లు కూడా ఉంటాయి. అవి మొత్తం చదివి సరే అని చెప్ప మంటారు. చాలా మంది అవి చదవకుండానే సరే అని చెబుతారు. యూట్యూబ్ కొత్తగా తెచ్చిన రూల్స్‌ని చాలా మంది ఇలాగే ఓకే చేశారు. ఇప్పుడా రూల్స్ షాక్ ఇచ్చేలా ఉన్నాయా? అని పలు ప్రశ్నలు వస్తున్నాయి.


ఇక ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా యూజర్లను కలిగివున్న సంస్థ యూట్యూబ్. క్షణక్షణానికీ కొన్ని వేల వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవ్వడం జరుగుతుంది. ఐతే... ఈ వీడియోల్లో చాలా వాటికి... యాడ్ రెవెన్యూ మాత్రం రావడం లేదు. ఇలాంటి వీడియోల వల్ల యూట్యూబ్ సర్వర్లకు అనవసరంగా స్పేస్ వృధా అవుతుంది. అందుకే యూట్యూబ్ యాజమాన్యం కొత్త రూల్స్ ని ప్రవేశ పెట్టడం జరిగింది . ఈ కొత్త రూల్స్ కి   ఇప్పటికే 90 శాతం కంటెంట్ క్రియేటర్లు ఓకే అని అన్నారు కూడా. ఐతే... ఇలా ఓకే చేసిన వారిలో చాలా మందికి అసలు యూట్యూబ్ తెచ్చిన కొత్త రూల్స్ ఏంటి? కొత్త కండీషన్లేంటి? అన్నది పూర్తి వివరాలు కూడా అసలు వారికీ తెలియదు.

ఆ నిబంధనలు చదివే ఓపిక లేక... ఓకే చేసేసినవాళ్లే ఎక్కువ. బట్... వాటిని చదివిన వాళ్లుకి  అసలు విషయం తెలిసి షాక్ లో ఉన్నారు అంటే నమ్మండి.
ఇక సింపుల్‌గా చెప్పాలంటే యూట్యూబ్ తెచ్చిన కొత్త రూల్స్... కంటెంట్ క్రియేటర్లకు భారీగా  షాక్ ఇస్తున్నాయి అంటే నమ్మండి. ఇకపై యూట్యూబ్‌లో క్రియేటర్లు అప్‌లోడ్ చేసే వీడియోలకు... యాడ్ రెవెన్యూ సరిగా రాకపోయినా లేక రెవెన్యూ తక్కువగా వస్తున్నా... ఇక ఆ క్రియేటర్ యూట్యూబ్ ఛానెల్‌ను యూట్యూబ్ యాజమాన్యం రద్దు చేయడం జరుగుతుంది అని సంస్థ తెలియచేసింది.


ఆ తర్వాత ఇక ఆ వీడియోలు గూగుల్ సర్వీసుల్లో అసలు ఉండవు. ఆ క్రియేటర్... జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ ఫొటోలు వంటి సేవలు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉండదు. ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత రావాలి  అన్న పూర్తి వివరాలు మాత్రం నిర్ణయించేది ఒక్క యూట్యూబ్ అధికారులు మాత్రమే.


మరింత సమాచారం తెలుసుకోండి: