దేశీ అతిపెద్ద బ్యాంక్ ఐనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్లకు వివిధ రకాల సేవలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది. రుణలు, డిపాజిట్లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం క్యాష్ విత్‌డ్రా, చెక్ బుక్ వంటి పలు సర్వీసులు కూడా వినియోగదారులు పొందవచ్చు. ఇన్‌స్టా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ సర్వీసు కూడా ఇందులో ఒక భాగమే అని తెలిపారు అధికారులు.


ఇక 18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఇన్‌స్టా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ను ఓపెన్  చేసుకోవచ్చు. ఇది  మాత్రం ఇప్పటి వరుకు బ్యాంక్‌తో ఎలాంటి సంబంధం లేని వారికి మాత్రమే వర్తిస్తుంది అని తెలిపారు. ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఉంటే చాలు సులువుగా అకౌంట్  ఓపెన్  చేసుకోవచ్చు.


అంతేకాకుండా కస్టమర్లు ఇతర బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల్లో ఓటీపీ ఆధారిత వెరిఫికేషన్ అకౌంట్‌ను ఉండకూడను వారికీ. అలాగే కస్టమర్లకు ఇతర బ్యాంక్ అకౌంట్లను కూడా కలిగి ఉండకూడదు. ఎలాంటి కారణం చెప్పకుండానే మీ అకౌంట్ రిక్వెస్ట్‌ను రిజెక్ట్ చేసే అధికారం బ్యాంక్‌కు ఉంటుంది అని తెలుపుతున్నారు అధికారులు.
ఇక  ఒకరి పేరుపై మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయగలం. ఒక లావాదేవీపై గరిష్టంగా రూ.49,999 వరకు పరిమితి మాత్రమే.

బ్రాంచుల్లో క్యాష్ ట్రాన్సాక్షన్లను కూడా  నిర్వహించ లేము. యోనో యాప్ ద్వారా అకౌంట్‌ను కొనసాగించవచ్చు. ఎస్‌బీఐ ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్‌లో గరిష్టంగా రూ.లక్ష వరకు మాత్రమే బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ఒక ఏడాదిలో అకౌంట్‌లో క్రెడిట్స్ విలువ రూ.2 లక్షలు మించి ఉండకూడదు. ఇన్‌స్టా అకౌంట్‌ను కలిగిన వారు ఏడాదిలోపు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి దీన్ని రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్‌గా కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది.


ఇక అకౌంట్ ఓపెన్ చేసిన ఏడాదిలోపు కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోకపోయినా కూడా అకౌంట్ క్లోజ్ అవుతుంది అని అధికారులు వెల్లడించడం జరిగింది. ఈ లింక్‌పై https://www.sbiyono.sbi/wps/portal/accountopening/digital-account#!/aoCustomerOpenOVD క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్  చేసుకోవచ్చు అని ఎస్‌బీఐ అధికారులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: