మాములుగా ఇంట్లో తింటుంటే.. అమ్మ వాళ్ళు అంటుంటారు.. ఎప్పుడు తినడమే పని అని. అయితే ఆ పనితో కూడా లక్షల్లో డబ్బు సంపాదించచ్చు అని ఎవరికి తెలియదు. ఎలా అనుకుంటున్నారా ? ఏమి లేదండి.. మీతో ఒక స్మార్ట్ ఫోన్ ఉండి.. మీ ముందు ఫుడ్ ఉంటె చాలు. అది తింటూ వీడియో తీసి యూట్యూబ్ లో పెడితే కొద్దికాలంలోనే లక్షలు సంపాదించచ్చు. ఇది కామెడీ కాదు అండి .. నిజంగా జరిగిన ఘటన ఇది. 


లండన్‌కు చెందిన చర్నా రైలీ అనే 22 యువతి తన జాబ్ ను వదిలేసి మరి యూట్యూబ్ ఛానల్ పెట్టింది. ఏంటి యు ట్యూబ్ కోసం జాబ్ వదిలేసుకుందా అని మీకు సందేహం రావచ్చు... కానీ ఈ కాలంలో యూట్యూబ్ లోనే ఆకట్టుకునే వీడియోలను పోస్ట్ చేసి వాటితో డబ్బును సంపాదిస్తున్నారు. 


ఇలా సంపాదించుకునే వారు కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చర్నా కూడా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. అయితే ఆ ఛానెల్ లో ఆమె కంటెంట్ ఎం పెడుతుందో తెలిస్తే షాక్ అవుతారు.. ఏంటి అని అనుకుంటున్నారా ? అదేనండి. చర్నాకు ఇష్టమైన ఆహారం తింటూ అది వీడియో తీసి యూట్యూబ్ లో పెడుతుంటుంది, అదే ఆమె పని. 


ఆ వీడియోలను నిత్యం 40 వేల మంది చూస్తూ ఉంటారు. తన వీడియోలకు ఈ స్థాయిలో స్పందన వస్తుండటంతో ఆమె ఉద్యోగానికి గుడ్ బై చెప్పి ఇంట్లోనే వీడియోలు తియ్యడమే పనిగా పెట్టుకుంది. రోజంతా బర్గర్, పిజ్జా తింటూ ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ నెలాఖరుకి లక్షల్లో లాభాలు తెచ్చుకుంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: