ఏంటో ఈ బంగారం ధరలు.. ఒకరోజు భారీగా పెరిగితే మరో రోజు భారీగా తగ్గుతాయి. పెరిగిన రోజు అయ్యో అనుకోవడం.. తగ్గిన రోజు అబ్బో అనుకోవడం ఈ కాలంలో కామన్. ఈ నేపథ్యంలోనే బంగారం ధర అబ్బో అనుకునే విధంగా బంగారం ధరలు తగ్గాయి. బుధువారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.40 తగ్గుదలతో రూ.39,510కు దిగొచ్చింది. 


అదేవిధంగా పది గ్రాముల 22 క్యరెట్ల బంగారం ధర కూడా రూ.30 తగ్గుదలతో రూ.36,220కు దిగొచ్చింది. అయితే బంగారం ధర తగ్గితే, వెండి ధర మాత్రం పరుగులు పెడుతుంది. రూ.50 పెరుగుదలతో కేజీ వెండి ధర రూ.48,750కు చేరింది. అయితే అంతర్జాతీయంగా జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గటంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందిని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. 


ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.38,200 వద్దనే ఉండగా 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా నిలకడగా రూ.37,000 వద్ద కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుండి డిమాండ్ పుంజుకోవడమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే బంగారం ధరలఫై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి అని చెప్పచ్చు. ఏది ఏమైనా బంగారం ధరలు తగ్గి పసిడి ప్రేమికులకు ఊరటనిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: