ప్రపంచంలో ప్రస్తుతం అత్యధిక వృద్ధి రేటు ఉన్న దేశాల్లో మనదీ ఒకటి. అయితే ఇది గతంలో చాలా ఎక్కువగా ఉండేది. యూపీఏ కాలంలో ఏకంగా 11 నుంచి 12 శాతం వృద్ధిరేటు వచ్చిన సంవత్సరాలూ ఉన్నాయి . కానీ క్రమణా ఈ వృద్ధి రేటు తగ్గుతూ వస్తోంది. అయితే కొన్నేళ్లుగా ఈ వృద్ధి రేటు తగ్గుదల మరీ ఎక్కువగా ఉంది.


తాజాగా ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ 2019 సంవత్సరానికి సంబంధించి దేశ వృద్ధిరేటు అంచనాను మరోసారి తగ్గించేంసింది. ఏఏడాది దేశ జీడీపీ 5.6శాతంగాఉంటుందని అంచనావేసింది. మందగమనంపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రభావం చూపడం లేదని మూడీస్ చెబుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనపరిస్థితులు...గతంలో అంచనావేసిన దానికంటే ఎక్కువ సమయం కొనసాగే అవకాశముందని తెలిపింది.


2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్లోబల్ మ్యాక్రో అవుట్ లుక్ విడుదల చేసిన మూడీస్ వచ్చేరెండేళ్లలో భారత వృద్ధిరేటు పుంజుకుంటుందని వెల్లడించింది. గతంతో పోలిస్తే వృద్ధిరేటు అంత వేగంగా ఉండకపోవచ్చని అభిప్రాయపడింది.  2020లో  దేశ వృద్ధిరేటు 6.6శాతంగా ఉంటుందన్న మూడీస్ 2021లో 6.7శాతంగా ఉంటుందని అంచనావేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: