బంగారం ధరలు స్థిరంగా కొనసాగవు . ఒక రోజు బంగారం ధరలు భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు బంగారం ధర భారీగా పెరిగింది. దేశి మార్కెట్ ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో శుక్రవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయిల పెరుగుదలతో 39,940 రూపాయలకు చేరింది.  


అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 280 పెరుగుదలతో 36,620 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి కూడా అదే బాటలో నడిచింది. కాకపోతే వెండి ధర బంగారం అంత పెరగకపోయిన స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర 70 రూపాయిలు పెరుగుదలతో 48,840 రూపాయలకు చేరింది. 


నిన్నటి వరుకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒకేసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం బంగారం ధరపై సానుకూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 


అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పైకి కదిలింది. ఔన్స్‌కు 0.01 శాతం పెరుగుదలతో 1,463.55 డాలర్లకు చేరింది. అయితే బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఇలా బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూ వెళ్తే సామాన్యులకు బంగారం కొనటం అనేది కలగానే మిగిలిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: