దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. వాహనదారులకు పైసలు ద్వారా కనిపించడం వల్ల పెట్రోల్, డీజల్ ధరలు పెరుగుతున్నట్టు కనిపించడం లేదు కానీ పెట్రోల్ డీజల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత పది రోజులుగా పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. 


పెట్రోల్ ధరలు వివిధ మెట్రో నగర్లో శుక్రవారం పెట్రోల్ లీటర్ కు 16 పైసల చొప్పున పెరిగింది. అయితే డీజల్ ధరలు మాత్రం స్థిరంగా అలాగే కొనసాగుతున్నాయి. హైదేరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ కు 16 పైసలు పెరిగి రూ. 78.16కు చేరగా, డీజల్ ధర స్థిరంగా  కొనసాగుతుంది. 


ఇంకా విజయవాడలోని పెట్రోల్ డీజిలు ధరలు కూడా ఇలాగె కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ. 77.40, డీజిల్‌ ధర 70.76 వద్ద ఉంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజల్ ధరలు ఇలాగె కొనసాగుతున్నాయి. కాగా ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణం. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.06 శాతం పెరుగుదలతో 62.64 డాలర్లకు చేరింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: