ప్రస్తుతం ప్రతి ఒకరికి ఆధార్  కచ్చితంగా  ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా ఎన్నో రకాల ఆన్‌లైన్ సేవలు ప్రజలుకు అందిస్తోంది. ఆధార్ అప్‌డేట్, స్టేటస్ చెక్ వంటి పలు సర్వీసులను ఆన్‌లైన్ ద్వారా సులభంగా మనము తెలుసుకోవచ్చు. నేరుగా యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆధార్ స్టేటస్‌ను సులభంగా తెలుసుకోవచ్చు. ఎన్‌రోల్‌మెంట్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు తెలియ పరిచి సులువుగా తెలుసుకోవచ్చు.


ఇక ఆన్‌లైన్‌లో  తెలుసుకోలేని వారికీ కూడా  1947 నెంబర్‌కు కాల్ చేసి కూడా ఇ-ఆధార్ జనరేట్ అయ్యిందా? లేదా? అని సులభంగా వివరాలను తెలుసుకోవచ్చు. ఎన్‌రోల్‌మెంట్ తర్వాత యూఆర్ఎన్ నెంబర్ సాయంతో ఆధార్ కార్డు అడ్రస్ ను కూడా మార్చుకునే అవకాశం ఉంది. ఇక ఆధార్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో చూద్దామా మరి... మొదట యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. సైట్ లో ముందుగా మై ఆధార్ ట్యాబ్‌లో గెట్ ఆధార్ కింద చెక్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది ఇంకో విండోలో. ఇక్కడ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, క్యాప్చా ఎంటర్‌ చేసి స్టేటస్‌ను సులువుగా తెలుసుకోవచ్చు. ఒక వేళా ఆధార్ అప్‌డేట్ అయ్యి ఉంటే ప్రింట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. 


ఇక ఈ విధానం మాత్రం ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ లేదా అప్‌డేట్ సెంటర్‌లో అప్‌డేట్ చేసుకొని ఉంటేనే  వర్తిస్తుంది. అదే ఆధార్ కార్డులో అడ్రస్ అప్‌డేట్ చేసి ఉంటే.. ఇప్పుడు దాని స్టేటస్ తెలుసుకోవాలని అనుకుంటే.. ఇది తెలుసుకోవాలన్న కూడా యూఐడీఏఐ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. మై ఆధార్ ట్యాబ్ కింద అప్‌డేట్ యువర్ ఆధార్ కింద చెక్ అడ్రస్ అప్‌డేట్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి అడ్రస్ అప్‌డేట్ స్టేటస్ కూడా సులువుగా తెలుసుకోవచ్చు. దీనికి అప్‌డేట్ రిక్వెస్ట్ నెంబర్ (యూఆర్ఎన్) కూడా కచ్చితంగా  కావాలి.


ప్రస్తుతం మాత్రం ఆధార్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, పేరు, అడ్రస్, జెండర్ ఇలాంటి వివరాలను అప్‌డేట్ చేసుకోవాలంటే  రూ.50 చెల్లించవలసి ఉంటుంది. ఇది వరకు వీటి అప్‌డేట్‌కు రూ.25  మాత్రమే తీసుకునే వారు. అంటే ఇప్పుడు చార్జీలు డబుల్ అయ్యాయి అన్నమాట. ఆధార్ కార్డులో ఫోటో లేదా ఫింగర్‌ప్రింట్స్ కూడా అప్‌డేట్‌ చేసుకోవాలంటే కచ్చితంగా రూ.50 చెల్లాంచాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: