భారతదేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంక్ లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అరుదైన ఘనతను సాధించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా మూడవ అతిపెద్ద భారతీయ సంస్థగా హెచ్‌డీఎఫ్‌సీ నిలిచింది. 7 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాపిటలైజేషన్ ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అధిగమించింది. దేశంలో మరే బ్యాంకు ఇప్పటివరకు ఈ ఘనతను సాధించలేదు. 
 
రిలయన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తరువాత మూడవ అతిపెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న మూడవ భారతీయ కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు  అవతరించింది. దేశంలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ నిలిచింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 9.38 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. 
 
రిలయన్స్ ఇండస్ట్రీస్ తరువాత స్థానంలో టాటా కనల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ఉంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 8.28 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. ఇప్పటివరకూ దేశంలోని మరే బ్యాంకు అందుకోని అరుదైన ఘనతను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అందుకోవడం గమనార్హం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు ఇంట్రాడేలో 1285 రూపాయలకు చేరింది. 52 వారాల గరిష్ట స్థాయిని చేరిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు ప్రస్తుతం 1283.40 రూపాయల దగ్గర ట్రేడవుతున్నాయి. 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: