బంగారం ధరలు స్థిరంగా కొనసాగవు . ఒక రోజు బంగారం ధరలు భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది. దేశి మార్కెట్ లో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్ లో శనివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 130 రూపాయిల తగ్గుదలతో 39,810 రూపాయలకు చేరింది.  


అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 130 రూపాయిల తగ్గుదలతో 36,490 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పడిపోగా వెండి ధర కూడా అదే బాటలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర 190 రూపాయిలు తగ్గుదలతో 48,650 రూపాయలకు చేరింది. 


మొన్నటి వరుకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నిన్న ఒకేసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం బంగారం ధరపై నిన్న సానుకూల ప్రభావం చూపింది, అయితే ఈరోజు అదే అంతర్జాతీయంగా భారీగా డిమాండ్ తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. 


అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. ఔన్స్‌కు 0.24 శాతం తగ్గుదలతో 1467 డాలర్ల స్థాయికి దిగొచ్చింది. ఏది ఏమైనా ఈరోజు పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: