మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? మీకు ఏదైనా సమస్య ఎదురువతుందా? అయితే ఫిర్యాదు చేయాలని అనుకుంటారా. పీఎఫ్ సబ్‌స్క్రైబర్ల సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రత్యేక సేవలు అందరికి అందుబాటులోకి తీసుకొని రాబోతుంది. ఈ  ఫిర్యాదుల కోసం తన వెబ్‌సైట్‌లో గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఆప్షన్ తీసుకోని వచ్చింది.


ఈపీఎఫ్ అకౌంట్ కలిగినవారు ఈపీఎఫ్ విత్‌డ్రాయెల్స్, ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్, కేవైసీ ఇలాంటి  పలు అంశాలకు సంబంధించిన సమస్యలను ఫిర్యాదు సులువుగా చేసుకునే అవకాశం కలిపిస్తుంది సంస్థ. ఇక ఈ పోర్టల్‌ను ఉద్యోగులు, కంపెనీలు, ఈపీఎస్ పెన్షనర్లు  సులువుగా వినియోగించవచ్చు. ఇక ఫిర్యాదు చేయాలంటే యూఏఎన్ నెంబర్ కచ్చితంగా అవసరం ఉంటుంది.


 యూఏఎన్ లేకపోతే అప్పుడు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) నెంబర్, కంపెనీ ఎస్టాబ్లిష్‌మెంట్ నెంబర్ తో ఐనా కూడా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది.
ఇక పీఎఫ్ అకౌంట్‌కు సంబంధించిన ఫిర్యాదులకు యూఏఎన్  కచ్చితంగా అవసరం ఉంటుంది. పెన్షన్ సంబంధిత ఇష్యూలకు పీపీవో నెంబర్ అవసరం అవుతుంది. ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకుంద్దాం మరి....ముందుగా http://epfigms.gov.in/Status ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఇక  ఫిర్యాదు చేసేందుకు రిజిస్టర్ గ్రీవెన్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత  కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. కెపాసిటీ/స్టేటస్ అనే ఆప్షన్‌ను ఎంచు కోవాలి. ఇక్కడ మీకు పీఎఫ్ మెంబర్, ఈపీఎస్ పెన్షనర్, ఎంప్లాయర్, అదర్స్ అనే ఆప్షన్లు ఉంటాయి.

ఇక మీ వద్ద యూఏఎన్ నెంబర్, పీపీఓ నెంబర్ లేకపోతే అదర్స్ అని ఎంచుకోవాల్సి ఉంటుంది. పీఎఫ్ అకౌంట్ సమస్య అయితే పీఎఫ్ మెంబర్ ఆప్షన్ ఎంచుకోండి. తర్వాత యూఏఎన్ నెంబర్ ఎంటర్, సెక్యూరిటీ కోడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.  ఫిర్యాదు నెంబర్ మీకు కచ్చితంగా ఎస్ఎంఎస్ వస్తుంది. ఫిర్యాదు స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ఎప్పుడు కావాలంటే అప్పుడూ చేసుకోనే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: