బంగారం ధరలు స్థిరంగా కొనసాగవు. ఒక రోజు బంగారం ధరలు భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది. దేశి మార్కెట్ లో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్ లో శనివారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 రూపాయిల తగ్గుదలతో 38,340 రూపాయలకు చేరింది.  


అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 60 రూపాయిల తగ్గుదలతో 37,340 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పడిపోగా వెండి ధర కూడా అదే బాటలో నడిచింది. అయితే బంగారం కంటే వెండి ధరే ఎక్కువగా తగ్గింది అని చెప్పవచ్చు. హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర 650 రూపాయిలు తగ్గుదలతో 48,000 రూపాయలకు చేరింది. 


అదే అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి.  విజయవాడలో, విశాఖపట్నంలో కూడా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. ఔన్స్‌కు 0.24 శాతం తగ్గుదలతో 1467 డాలర్ల స్థాయికి దిగొచ్చింది. బంగారం, వెండి ధర తగ్గినప్పటికీ పసిడి ప్రియులు కొనుగోలు చెయ్యాలంటే ఆలోచిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: