రిలయన్స్ కమ్యూనికేష దేశంలో టెలికాం విస్తరించిన మొదట్లో వచ్చిన ఈ ఫోన్ సర్వీస్ కంపెనీ అప్పట్లో ఓ సంచలనం. కానీ ఇప్పుడు మొత్తానికే మూసేస్తున్న పరిస్థితి. నష్టాలు అప్పులు భారమై రిలయన్స్ దివాళా తీసింది. తాజాగా ఈ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్) డైరెక్టర్ బాధ్యతల నుంచి అనిల్ అంబానీ వైదొలిగారు. ఈ మేరకు ఆర్ కామ్ కు అయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.


రిలయన్స్ కమ్యూనికేషన్ కి జియో వచ్చిన తర్వాత తీవ్ర రుణ సంక్షోభంలో చిక్కుకుంది. దివాలా ప్రక్రియలో ఉంది. రెండవ త్రైమాసికంలో ఆర్ కామ్ ఏకంగా రూ.30142 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. భారతీయ కార్పొరేట్ కంపెనీల చరిత్రలోనే ఇదే అతి పెద్ద రెండో నష్టం అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.దీంతో ఇక కంపెనీని నడిపించడం కష్టమని భావించిన అనిల్ అంబానీ త్రైమాసిక ఫలితాలు వెలువడిన మరునాడే రాజీనామా చేయడం గమనార్హం.


ధీరుభాయ్ అంబానీ స్థాపించిన రిలయన్స్ ను ముక్కులుగా చేసి పంచుకున్నాక తొలి సంవత్సరం దేశంలోనే టాప్ శ్రీమంతుల్లో ఆయన కుమారులు ముఖేష్ అంబానీ - అనిల్ అంభానీలు ఉన్నారు. ఇప్పుడు అన్న ముఖేష్ దేశంలోనే నంబర్1 ధనవంతుడిగా మారగా.. అప్పులు చెల్లించలేక తమ్ముడు అనిల్ అంబానీ కంపెనీలు అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు. పంచుకున్నప్పుడు రిలయన్స్ కమ్యూనికేషన్స్ అనిల్ అంబానీకి వచ్చింది. అయితే అనిల్ దాన్ని విజయవంతంగా నడిపించలేకపోయాడు.

స్వీడన్ సంస్థ ఎరిక్సన్ తోపాటు రుణ సంస్థలు దాదాపు 49వేల కోట్లను తమకు ఆర్ కామ్ చెల్లించాలని  జాతీయ కంపెనీల ట్రిబ్యునల్ పై కేసు వేయడంతో దివాలా తీసింది.అయితే ఇప్పుడు రిలయన్స్ కు ఉన్న ఆస్తులు అమ్మినా అప్పులు కట్టలేని దుస్థితి ఆ కంపెనీ చేరింది .దీంతో ఆర్ కామ్ కు అనిల్ అంబానీ రాజీనామా చేశారు.దీని వల్ల ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది


మరింత సమాచారం తెలుసుకోండి: