బంగారం ధరలు ఈరోజు మళ్ళి దిగొచ్చాయి. ఒక రోజు బంగారం ధరలు భారీగా తగ్గితే మరో రోజు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు బంగారం ధర భారీగా దిగొచ్చింది. దేశి మార్కెట్ లో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్ లో నేడు సోమవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 రూపాయిల తగ్గుదలతో  39,760 రూపాయలకు చేరింది.  


అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 40 రూపాయిల తగ్గుదలతో 36,450 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు పడిపోగా వెండి ధర కూడా అదే బాటలో నడిచింది. బంగారం కంటే వెండి ధరే ఎక్కువగా తగ్గింది అని చెప్పవచ్చు. హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర 650 రూపాయిలు తగ్గుదలతో 48,000 రూపాయలకు చేరింది. 


అంతర్జాతీయంగా బంగారం కొంగులు దారాల నుంచి డిమాండ్ తగ్గటంతో బంగారంపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలాగె  కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం బంగారం, వెండి కొనాలనుకునేవారు వెంటనే కోనేయండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: