సౌత్ ఆఫ్రికా చెందిన ఒక వ్యక్తి అచ్చం సినిమా హీరోలాగానే తన మోకాలు పై కూర్చొని తన లవర్ కి వుంగరం ఇస్తూ కేఎఫ్‌సీ రెస్టారెంట్ లో ప్రపోజ్ చేశాడు. ఇదంతా చూస్తున్న.. కేఎఫ్‌సీ సిబ్బంది, అక్కడ తినడానికి వచ్చిన వాళ్ళందరూ లేచి చప్పట్లు కొడుతూ వీడియోలు తీశారు. అయితే ఒక వ్యక్తి ఈ ప్రపోసల్ వీడియోని సామాజిక మాధ్యమాలలో అప్లోడ్ చేశాడు. అప్లోడ్ చేసిన దగ్గర్నుంచి ఈ వీడియో తెగ వైరల్ అయిపోయింది. ఈ సందర్భంలోనే సౌత్ ఆఫ్రికాకు చెందిన ఒక జర్నలిస్ట్ "సౌత్ ఆఫ్రికా అబ్బాయిలు దరిద్రులు, రెస్టారెంట్ లో కూడా ప్రపోజ్ చేస్తున్నారు. నా అర్థం ఏంటంటే.. అస్సలు ఎవరు కేఎఫ్‌సీ రెస్టారెంట్ లో ప్రపోజ్ చేస్తారు?" అంటూ ఈ వీడియోని ఉద్దేశిస్తూ ఒక అవమానకర ట్వీట్ చేసింది. 


ఈ ట్వీట్ కూడా తెగ వైరల్ అయిపోయింది. చాలా మంది ట్విట్టర్ యూజర్స్... వాళ్ళ ప్రేమను అవమానించిన ఈ జర్నలిస్టుకు చివాట్లు పెట్టారు. దీంతో ఆ జర్నలిస్టు తన ట్వీట్ ని డిలీట్ చేసి ఆమె అకౌంట్ ని ప్రైవేట్ చేసుకుంది. ఈమె చేసిన ట్వీట్ ని కేఎఫ్‌సీ కంపెనీ కూడా చూసింది. సో, అవమానం జరిగిన ఈ ప్రేమకులకి చిన్న హ్యాపీనెస్ కలిగించాలనే ఉద్దేశంతో వారు ఎవరో తెలుసుకోవాలి అని అనుకుంది కేఎఫ్ సీ .

ఈ వీడియోలో ఉన్న ప్రేమికులని వెతకడానికి మాకు ఎవరు సహాయం చేస్తారో వారికి మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించింది. దీంతో కొన్ని వేల మంది ఈ ప్రేమికుల కోసం వెతికి.. కేఎఫ్‌సీ వారికి కరెక్ట్ అయిన అడ్రస్ ఇచ్చారు. అప్పుడు ఆ ప్రేమ జంటను హెక్టర్ మకాంసి, నొంహ్లాణ్హల సోల్డట్ గా గుర్తించిన కేఎఫ్‌సీ సౌత్ ఆఫ్రికా సంస్థ వారు... ఈ ప్రేమ జంట కోసం హనీ మూన్ ట్రిప్ని కేప్ టౌన్ లో ప్లాన్ చేసి అందుకుగాను అయ్యే ఖర్చును తామే భరిస్తామంటూ ప్రకటించారు. కేఎఫ్‌సీ తో పాటు ఇతర కంపెనీస్ వారు తమ వంతుగా ఆఫర్లు ఇచ్చారు. 


ఎమెరాల్డ్ డైమండ్ కంపెనీ.. ఈ ప్రేమ జంటను చూస్తే ముచ్చటేస్తుంది.. 2 లక్షల 20 వేల విలువైన రెండు డైమండ్ రింగ్స్ ని ఇస్తామంటూ ప్రకటించింది. పుమా కంపెనీ రూ.46,331 విలువైన దుస్తులను, హువావే కంపెనీ 2 స్మార్ట్‌ఫోన్‌ను ఇస్తామని ఆఫర్ ఇచ్చారు.  సౌత్ ఆఫ్రికా స్టాండర్డ్ బ్యాంకు.. ఈ ప్రేమికుల వ్యక్తిగత అప్పులను క్లియర్ చేస్తామంటూ ప్రకటించింది. సౌత్ ఆఫ్రికా ఆడి కారు కంపెనీ.. "మేము వారిని కేప్ టౌన్ కి మా ఆడి కారులో చేరవేస్తామంటూ" ఆఫర్ ఇచ్చింది. ఇంటర్నెట్ పుణ్యమాంటూ ఊహించని రీతిలో వీరికి లక్షల విలువైన గిఫ్ట్స్ వచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: