ప్రముఖ ప్రైవేట్ దిగ్గజ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రకటించింది. ఈ తగ్గింపు నిర్ణయం నవంబర్ 16 నుంచి అమలులోకి వస్తుంది అని బ్యాంకు అధికారులు ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో డబ్బు డిపాజిట్ చేసే వారికి ఇకపై తక్కువ వడ్డీ వస్తుంది. 


తాజాగా సవరణ చేసిన రేట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 7 రోజుల నుంచి 14 రోజుల మెచ్యూరిటీ వ్య‌వ‌ధి గ‌ల డిపాజిట్ల‌పై 3.50 శాతం, 15 రోజుల నుంచి 29 రోజుల వ్య‌వ‌ధి గ‌ల డిపాజిట్ల‌పై 4 శాతం, 30 రోజుల నుంచి 45 రోజుల వ్య‌వ‌ధి గ‌ల 4.90 శాతం, 46 రోజుల నుంచి 6 నెల‌ల వ్య‌వ‌ధి గ‌ల డిపాజిట్ల‌పై 5.40 శాతం, 6 నెల‌ల నుంచి 9 నెల‌ల లోపు గ‌ల డిపాజిట్ల‌పై 5.80 శాతం, 9 నెల‌ల నుంచి ఏడాది లోపు డిపాజిట్ల‌పై 6.05 శాతం వ‌డ్డీని ఇస్తుంది. 


సంవ‌త్స‌రం, రెండు సంవ‌త్సరాల సమయం ఉన్న డిపాజిట్ల‌పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న వ‌డ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.. సంవ‌త్స‌రం నుంచి రెండు సంవ‌త్స‌రాల‌ కాల‌వ్య‌వ‌ధి గ‌ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 15 బేసిస్ పాయింట్ల మేర వ‌డ్డీ రేటును త‌గ్గించి, సంవ‌త్స‌రం కాలవ్యవధి గ‌ల డిపాజిట్ల‌పై 6.30 శాతం, సంవ‌త్స‌రం 1 రోజు నుంచి 2 సంవ‌త్స‌రాలు లోపు డిపాజిట్ల‌పై 6.30 శాతం వ‌డ్డీని అందిస్తుంది. ఇంకా అలాగే 2 నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధి ఉన్న డిపాజిట్లపై కూడా హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: