దేశంలో  అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రెండు ప్రత్యేకమైన అకౌంట్లను వినియోగదారుల ముందుకు తీసుకొని రాబోతుంది. ఆ అకౌంట్ ల పేర్లు పెహ్లా కదమ్, పెహ్లీ ఉడాన్క. ఈ అకౌంట్లను  స్టేట్ బ్యాంక్ చిన్న పిల్లల కోసం లాంచ్ చేయడం జరిగింది. వీటి ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంబంధిత అంశాల గురించి చిన్నారులకు అవగాహన కల్పిస్తుంది.

 

ముఖ్యంగా ఈ అకౌంట్ కలిగిన పిల్లలు అన్ని రకాల బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించుకునే అవకాశం ఉంది. ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు కూడా చేసుకునే అవకాశం ఉంది. ఇక  అకౌంట్ ద్వారా జరిపే కొనుగోళ్లపై  మాత్రం పరిమితి కచ్చితంగా ఉంటుంది. ఈ ఖాతాలకు ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ అకౌంట్లలో గరిష్టంగా రూ.10 లక్షల వరకు బ్యాలెన్స్ మనం పెట్టుకోవచ్చు.

 


ఇక అకౌంట్స్ ప్రత్యేకతల విషయానికి వస్తే  మనము అకౌంట్ తెరిచిన వారికి చెక్‌బుక్ కూడా అందజేస్తారు. ఇందులో పిల్లల పేరు ఉంటుంది. కానీ  చెక్‌బుక్‌ను పిల్లల తల్లిదండ్రులకు ఇవ్వడం జరుగుతుంది. ఏటీఎం కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డుపై చిన్న పిల్లల ఫోటో ప్రింట్ అయ్యి వస్తుంది. రోజుకు రూ.5,000 వరకు క్యాష్ విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.

 

ఇక బిల్ పేమెంట్స్, టాప్ అప్స్ వంటి  సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఒక ట్రాన్సాక్షన్ పరిమితి మాత్రం రూ.2,000గా ఉంటుంది. అకౌంట్‌పై చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటాయి. పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ కూడా లభిస్తుంది. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటి ప్రయోజనాలు పొందవచ్చు ఈ అకౌంట్స్ తీసుకోవడం ద్వారా.

మరింత సమాచారం తెలుసుకోండి: