మొబైల్ వినియోగదారులకు భారీ షాక్ ఇస్తున్నాయి టెలికాం సంస్థలు. కస్టమర్లకు టెలికాం కంపెనీలు షాకిచ్చాయి. తమ టారిఫ్ ధరలను పెంచుతున్నట్లు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తాజాగా తెలియచేయడం జరిగింది. పెంచనున్న ధరలు డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. అలాగే, డిసెంబర్ ప్రారంభంలో ధరలు పెంచుతామని భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించింది. అయితే ఎంత మొత్తం పెంచుతారనే అంశాన్ని ఈ రెండు టెలికం దిగ్గజాలు కూడా వెల్లడించలేదు. 

 

టారిఫ్ పెంపునకు ఈ రెండు కంపెనీలు కారణాలను కూడా వెల్లడించాయి. తమ కస్టమర్లకు ప్రపంచస్థాయి డిజిటల్ సేవలు అందించేందుకు టారిఫ్ పెంచుతున్నట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. వ్యాపారం లాభసాటిగా మార్చేందుకు పెంచుతున్నట్లు ఎయిర్ టెల్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో రెండు కంపెనీలు కూడా భారీ మొత్తంలో నష్టాలను ప్రకటించిన విషయం తెలిసిందే. నష్టాలను ప్రకటించిన కొద్ది రోజులకే టారిఫ్ పెంచుతున్నట్లు ప్రకటన విడుదల చేయడం జరిగింది.

 

రెండో క్వార్టర్‌లో వొడాఫోన్ ఐడియా రూ.50,921 కోట్లు, ఎయిర్‌టెల్ రూ.23,045 కోట్ల మేర నష్టాన్ని నమోదు చేశాయి. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు ఇప్పటికై కనీస ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. డేటా లేకుండా వొడాఫోన్ ఐడియా నెలవారీ మొబైల్ సర్వీస్ కనీస ఛార్జ్ రూ.24 నుంచి ప్రారంభమవుతుండగా, డేటా సర్వీసులతో రూ.33 నుంచి ప్రారంభమవుతుంది.

 

              2016లో జియో వచ్చిన తర్వాత టెలికం రంగ ముఖచిత్రం మారింది. ముఖ్యంగా టెలికం పరిశ్రమలో ధరల యుద్ధం చోటు చేసుకుంది. ఈ ధరల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకే వొడాఫోన్, ఐడియా ఒక్కటయ్యాయి. అయినా ఆర్థిక ఇబ్బందులు తొలగలేదు. ఈ నేపథ్యంలోనే టారిఫ్ పెంపుకు సిద్ధం అవుతున్నాయి. ఇక  వినియోగదారులు బాగా ఇబ్బందులు పడవలసిన సమయం వచ్చినట్లు కనిస్పిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: