పసిడి ప్రియులకు భారీ షాక్ ఏ ఇచ్చింది. ఎప్పుడు ఒకేలా తగ్గితే అది బంగారం ఎందుకు అవుతుంది.. అందుకే మూడు రోజుల నుంచి భారీగా తగ్గుతున్న బంగారం ధర ఈరోజు ఒకేసారి పెరిగి పసిడి ప్రేమికులకు షాక్ ఇచ్చింది. ఏంటి పెరిగిందా ? అనుకుంటున్నారా ? పెరిగింది అండి.. భారీగా పెరిగింది. 

 

హైదరాబాద్ మార్కెట్ లో నేడు బుధువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయిల పెరుగుదలతో 39,910 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 220 రూపాయిల పెరుగుదలతో 36,580 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా, వెండి ధర కూడా అదే బాటలో నడిచింది. 

 

హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర 60 రూపాయిలు పెరుగుదలతో 47,865 రూపాయలకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధర భారీగా పెరిగింది అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు ఇదే రీతిలో పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా ఇలానే కొనసాగుతున్నాయి. 

 

అయితే దేశ ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో మాత్రం బంగారం ధర భారీగా పెరిగింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా పైకి కదిలింది. ఇలా బంగారం, వెండి ధర పెరుగుదలకు కారణం పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పుంజుకోవడం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.

 

అయితే బంగారం ధర పెరిగేందుకు చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: