గుండె లబ్ డబ్ అని కొట్టుకోవడం ఎలాగో ఇప్పుడందరూ టిక్ టాక్ అని కొట్టుకోవడం అలవాటైపోయింది.  ఇప్పుడు ఎవరి ఫోన్‌లో చూసినా ఈ యాప్ కనిపిస్తుంది. టిక్ టాక్ పిచ్చితో కుర్రకారు ఊగిపోతోంది. స్కూలుకెళ్లే చిన్నపిల్లలు సైతం టిక్ టాక్‌ లోకంలో మునిగిపోతున్నారు. వెరైటీ కాన్సెప్ట్స్, రిస్కీ ఫీట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 

 

ఇంకొందరు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడి జైలు పాలవుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఇద్దరు యువకులు బైక్‌పై గన్ పట్టుకుని తిరిగిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మారణాయుధాలతో పబ్లిక్ ప్లేస్‌లో స్టంట్స్ చేయడం పోలీసుల దృష్టికి వచ్చింది. వీడియో ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.  

 

సెల్ఫీలు, టిక్ టాక్ వీడియోల కోసం రిస్కీ ఫీట్స్ చేసిన చనిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. రైలుపైకి ఎక్కి వీడియో తీస్తున్న క్రమంలో హైటెన్షన్ విద్యుత్ లైన్‌లు తగిలి యువకులు మరణించిన వార్తలను మనం చాలానే చూశాం. అంతేకాదు టిక్ టాక్ మాయలో పడి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తి ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. కొందరు ప్రభుత్వోద్యోగులు వీడియోలు చిత్రీకరించి సస్పెండ్ అయిన ఘటన చాలానే జరిగాయి. వీటిన్నింటికి తోడు అశ్లీలత, అసభ్యతను టిక్ టాక్ ప్రోత్సహిస్తోందని.. టిక్ టాక్‌ను నిషేధించాలంటూ ఇప్పటికే పలు నగరాల్లోని కోర్టుల్లో పిటీషన్‌లు దాఖలయ్యాయి. అయినా టిక్ టాక్ మత్తు ఎప్పుడు వదులుతుందో..

 

సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు సైతం డ్యూటీ సమయంలో టిక్ టాక్ చేస్తూ చాలా సార్లు ఉద్యోగాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది. కొందరు పోలీసులు ఖాకీ యూనిఫాంలోనే వీడియోలు చిత్రీకరించి సస్పెండ్ అయిన ఘటన చాలానే చోటు చేసుకోవడం జరిగింది. వీటిన్నింటికి తోడు అశ్లీలత, అసభ్యతను టిక్ టాక్ కూడా బాగా ప్రోత్సహిస్తోందని.. అలాంటి వీడియోలు చిన్న పిల్లలు, యువత ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పలు ప్రజా సంఘాలు వెల్లడిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: