రియల్ మీ తన మొదటి స్మార్ట్ ఫోన్ రియల్ మీ ఎక్స్2 ప్రోతో పాటు... బడ్జెట్ శ్రేణిలో మరో స్మార్ట్ ఫోన్ ను కూడా లాంచ్ చేసింది. అదే రియల్ మీ 5s. బడ్జెట్ శ్రేణిలో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ లో 48 మెగా పిక్సెల్ కెమెరానే ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీంతో ఒకేసారి ఫ్లాగ్ షిప్, బడ్జెట్ కేటగిరీల్లో రియల్ మీ అదిరిపోయే ఫోన్లను లాంచ్ చేసి మార్కెట్ మీద పట్టుబిగించడానికి మరింత ఎక్కువగా ప్రయత్నిస్తోంది.


ఫోన్ లో రెండు వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. క్రిస్టల్ బ్లూ, క్రిస్టల్ పర్పుల్, క్రిస్టల్ రెడ్ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్ డీ+ మినీ డ్రాప్ డిస్ ప్లేను అందించారు. 


స్క్రీన్ టు బాడీ రేషియో 89 శాతంగా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పని చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సూపర్ మాక్రో సెన్సార్, 2 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న పొర్ ట్రెయిట్ లెన్స్ ను ఇందులో అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ గా ఉంది. ఈ ఫోన్ లో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించారు.


ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. దీని స్టాండ్ బై సామర్థ్యం 718 గంటలు గానూ, వీడియో స్ట్రీమింగ్ సామర్థ్యం 12 గంటలుగానూ ఉండనున్నట్లు రియల్ మీ తెలిపింది. ఆండ్రాయిడ్ 9 Pie ఆధారిత కలర్ ఓఎస్ 6 ఆపరేటింగ్ స్కిన్ పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ఇందులో యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ లు కూడా ఉన్నాయి. డ్యూయల్ సిమ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీంతోపాటు మైక్రో ఎస్ డీ కార్డు వేసుకోవడానికి కూడా ఇందులో అదనంగా స్లాట్ అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: