రియల్మి కంపెనీ ఎక్స్‌2 ప్రో పేరుతో వచ్చిన ఈ మొబైల్‌లో క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్లస్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దిల్లీలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ మొబైల్‌ను ఆవిష్కరించింది. దీంతోపాటు బడ్జెట్‌ కేటగిరీలో రియల్‌మీ 5ఎస్‌ను కూడా లాంచ్‌ చేశారు. ఈ నెల 26 నుంచి రియల్‌మీ ఎక్స్‌2 ప్రో సేల్‌కి తీసుకొస్తున్నారు. ఇక ఈ నెల 29 నుంచి రియల్‌మీ 5ఎస్‌ అందుబాటులోకి రానుంది. 

 

రియల్‌మీ ఎక్స్‌2 ప్రో ఆండ్రాయిడ్‌ 9.0(పై) ఆధారిత  కలర్‌ ఓఎస్‌ 6.0తో పని చేస్తుంది. 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ ఫ్లూయిడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. 90 హెడ్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే ఉంటుంది. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్లస్‌ ప్రాసెసర్‌ వాడారు. 6జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమోరీతో ఈ మొబైల్‌ మొదలవుతుంది. 12జీబీ ర్యామ్‌, 256జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ మరో వేరియంట్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌కు 64 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరా ప్రత్యేక ఆకర్షణ. దాంతో పాటు 13ఎంపీ టెలీఫొటో లెన్స్‌ను, 8 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌ను అమరుస్తున్నారు. ముందు భాగంలో 16 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 471 కెమెరాను తీసుకొస్తున్నారు. 4000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. ఇది 50వాట్‌ వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. కేవలం 35 నిమిషాల్లో 100శాతం ఛార్జింగ్‌ అవుతందని రియల్‌మీ తెలిపింది. 8జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్‌ ధర రూ.29,999గా నిర్ణయించారు. 12జీబీ ర్యామ్‌, 256జీబీ మోడల్‌ను రూ.33,999గా నిర్ణయించింది.

 

రియల్‌మీ 5ఎస్‌ కలర్‌ ఓఎస్‌ 6తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ ఆధారంగా ఇది పని చేస్తుంది. ఈ మొబైల్‌ 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ (720X1600) డిస్‌ప్లేతో తయారుచేసింది. దీనికి అక్టాకోర్‌ క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌ అమర్చారు. 4జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సామర్థ్యం కలిగి ఉంది. ఈ మొబైల్‌ బ్యాటరీ సామర్థ్యం 5000ఎంఏహెచ్. 48 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరా ఈ మొబైల్‌కు ప్రత్యేక ఆకర్షణ,  4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వెర్షన్‌  ధర రూ. 9,999. అదే 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వెర్షన్‌ అయితే రూ. 10,999 గా నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: