గత కొన్ని రోజులుగా మనం భారతి ఎయిర్ టెల్, వోడాఫోన్-ఐడియా.. ఆ తర్వాత జియో టెలికాం కంపెనీలు మొబైల్ సర్వీస్ టారిఫ్(టాక్స్) రేట్లను పెంచుతున్నాయనే వార్తలను వింటున్నాం. భారతి ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా కొత్త టారిఫ్ లను డిసెంబర్ మొదటి రోజుల్లో ప్రకటించబోతున్నాయి. అయితే రిలయన్స్ జియో కూడా భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా బాటలోనే నడుస్తోందని సమాచారం. గతం లో 15% రేట్లను పెంచిన జియో.. ఈసారి కూడా అదే విధంగా 15 శాతం పెంచుతుందని సమాచారం. కానీ భారతి ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా టెలికాం కంపెనీలు 30 నుంచి 40 శాతం వరకు పెంచబోతున్నాయని సమాచారం. ప్రస్తుతం ప్రతి నెల ఒక్క ఎయిర్ టెల్ వినియోగదారుడు నుంచి... (ఏఆర్ పీ యూ) 124 రూపాయలు ఆదాయం వస్తుంటే.. ఇప్పుడు ఆ ఒక్క వినియోగదారుడు నుంచి కనీసం 150 రూపాయల ఆదాయం రాబట్టేలా టెలికాం కంపెనీలు నిర్ణయం తీసుకుంటున్నాయంట. 




కనీసం (ఏఆర్ పీ యూ)150 రూపాయలు ఆదాయం వస్తేనే రుణ భారంతో సతమతమవుతున్న టెలికాం సంస్థలు కోలుకుంటాయని.. సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ) డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ అన్నారు. ఇంతకీ ఏఆర్‌పీయూ అనగా యావేరేజ్ రెవిన్యూ పర్ యూనిట్... అంటే ఇప్పుడు ఎయిర్ టెల్ నెట్వర్క్ ను వినియోగించే వారు 100 మంది ఉన్నారనుకోండి... వారి నుంచి నెలకు టెలికాం కంపెనీకు వచ్చే మొత్తం ఆదాయాన్ని రూ. 12,400 అనుకుందాం... అపుడు మనం ఏఆర్‌పీయూ ఎలా లెక్కకడతామంటే... రూ.12, 400/100= రూ. 124. అయితే రూ. 124 ఆదాయానికి భారతి ఎయిర్ టెల్ బహుశా 20 శాతం పెంచితే...ధర ఎలా లెక్కకట్టాలంటే .  (124)x20/100 =రూ. 24.8. అప్పుడు మీ నెల ప్యాక్ రూ.199 అయితే.. రాబోయే రోజుల్లో రూ.223.8  వెచ్చించాలి. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే అని మీరు గమనించాలి. 


‘‘చాలా మంది అనలిస్టులు, టెలికం శాఖ కూడా ఏఆర్‌పీయూను 20 శాతం మేర పెంచుకోవాలన్న సంకేతాన్ని ఇచ్చాయి. విడిగా టారిఫ్‌లపై నేను మాట్లాడడం లేదు. ప్రస్తుతం రూ.124 ఏఆర్‌పీయూగా ఉంది. ఇది కనీసం రూ.150 అంతకంటే ఎక్కువకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే లాభదాయకత సాధ్యం అవుతుంది. మూడు సంవత్సరాల క్రితం మా కస్టమర్లు సగటున ప్రతీ నెలా కాల్స్‌, కొంత డేటా కోసం రూ.180-200 వరకు చెల్లించే వారు. భరించడం అన్నది సమస్య కాదు. ఏఆర్‌పీయూ రూ.20 పెరగడం అంటే, టారిఫ్‌లు రూ.20 పెరుగుతున్నట్టు కాదు’’ అని రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: