పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిన్న మధ్యాహ్నం వర్షం కురిసింది. వర్షం అంటే సాధారణ వర్షం కాదండోయ్... నోట్ల వర్షం కురిసింది. హా... ఆశ్చర్యపోతున్నారా..??? ఇది నిజం.. ఆరో అంతస్తు నుంచి కిందపడుతున్న నోట్లను పట్టుకునేందుకు అక్కడి నుంచి  రోడ్డుపై వెళ్తున్న జనం ఎగబడ్డారు. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా రద్దీగా మారింది. పశ్చిమ బెంగాల్ లో రాజధాని కోల్‌కతాలో బెంటిక్ స్ట్రీట్‌లోని ఓ భవనంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిన్న దాడులు జరిపారు. ఈ విషయం తెలిసిన పక్కనే ఉన్న హోఖ్ మెర్కంటైల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిబ్బంది ఆరో అంతస్తులోని కిటికీ నుంచి నోట్ల కట్టలను కిందికి విసిరేశారు.

ఆ భవనం పై నుంచి కురుస్తున్న నోట్ల వర్షాన్ని చూసిన జనం తొలుత/ మొదట  ఆశ్చర్యపోయారు.  అది నిజమా, అబద్దామా అనుకున్నారు..???  ఆ తర్వాత  తేరుకుని అందినంత పట్టుకుని ఎంచక్కా అక్కడి నుండి వెళ్లిపోయారు. కిందపడిన నోట్లలో రూ.2,000, రూ.500, రూ.100 నోట్లు ఉన్నాయి. నోట్లు విసిరేసిన ఘటనపై డీఆర్ఐ అధికారులు మాట్లాడుతూ.. తమ సోదాలకు, నోట్లు వెదజల్లడానికి కారణం ఉందని అనుకోవడం లేదన్నారు. 

ఈ సమాచారం దావనంలా వ్యాపించడంతో జనాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కానీ, అప్పటికే కొంతమంది వ్యక్తులు ఆ డబ్బులన్నీ అక్కడి నుండి ఊడ్చేశారు. కనీసం ఒక్క నోటు కూడా వదలకుండా తీసుకెళ్లిపోయారు. దీంతో అక్కడికి చేరుకున్న ప్రజలు చాలా బాధపడ్డారు. ఆ డబ్బులు పాడేస్తున్నప్పుడు ఆ వీధిలో లేకపోయామే అని తెగబాధపడిపోయారు. 

అయితే, ఆ డబ్బులను ఏరుకున్న వ్యక్తులు మాత్రం ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. ఈ ఘటన బుధవారం మధ్యా్హ్నం 2.30 గంటలకు చోటుచేసుకుంది. దీనిపై స్పందించేందుకు డీఐఆర్ అధికారులు నిరాకరించారు. ఆ భవనం నుంచి నోట్ల వర్షం కురుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: