ఇప్పటికే మన దేశం అన్నివిధాలా డిజిటల్ గా ముందుకు సాగుతోంది. ప్రజలు కూడా మెల్లగా డిజిటల్ దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ప్రజల్లో ఎక్కువమంది మొబైల్స్ వాడకాన్ని మరింత విస్తృతం చేయడం, ఇంటర్నెట్ ధరలు కూడా చాలావరకు అందరికీ అందుబాటులోకి రావడంతో, మెజారిటీ ప్రజల నెట్ వాడకం ఎక్కువ అయింది. నిజానికి మూడేళ్ళ క్రితం వరకు అత్యధిక ధర ఉండే కాల్ రేట్స్ మరియు ఇంటర్నెట్ టారిఫ్ ధరలు, ఒక్కసారిగా టెలికాం రంగంలోకి జియో రంగ ప్రవేశంతో వినియోగదారుడికి అత్యల్ప ధరలకు అందుబాటులోకి రావడం జరిగింది. అయితే మొదట్లో అన్ని ఫ్రీ గా ఇచ్చిన జియో, ఆ తరువాత పలు రకాల మొబైల్ ప్లాన్స్ తీసుకువచ్చింది. ఇకపోతే ఇటీవల సడన్ గా ఐయుసి చార్జీల పేరిట వినియోగదారుల జేబుకు కొద్దిపాటి చిల్లు పెట్టిన జియో

 

ఇప్పటివరకు ఆ చార్జీలు వినియోగదారుల కోసం సంస్థ భరిస్తూ వచ్చిందని, అయితే కేవలం జనవరి వరకు ఈ మూడు నెలలు మాత్రం వినియోగదారులు భరించవలసిందే అని చెప్పడం జరిగింది. ఇకపోతే నిన్న సుప్రీం కోర్టు టెలికాం సంస్థలకు భారీ షాక్ ఇస్తూ ఇచ్చిన తీర్పు మేరకు వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ సంస్థలు దాదాపుగా ఎనభైవేల కోట్లకు పైగా అప్పును కలిగి ఉండడంతో వాటిని పూడ్చడానికి అతి త్వరలో కాల్, ఇంటర్నెట్ రేట్లు భారీగా పెంచనున్నట్లు తెలుస్తోంది. నిజానికి జియో దెబ్బకు అతితక్కువ ధరకు కాల్స్ మరియు ఇంటర్నెట్ డేటా అందించడం, అలానే దాని నిమిత్తం నెట్వర్క్ విస్తరణ కోసం భారీగా రుణాలు తీసుకోవడంతో ఆ రెండు సంస్థలు ఎంతో నష్టాన్ని చవిచూడవలసి వచ్చిందట. అయితే మొత్తంగా చూసుకుంటే స్పెక్ట్రమ్ లైసెన్సులు, మరియు రుసుము నిమిత్తం ఏజిఆర్ రూపంలో కొంత మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెల్లించవలసి ఉండడం, ఇవన్నీ కలిపి ఇంత భారీ మొత్తంగా బాకీ ఉండిపోవడంతో, 

 

ఈ నష్టాలను పూడ్చుకుని తమ కంపెనీలు ముందుకు నడపాలంటే ఇకపై వినియోగదారులకు చార్జీలు పెంచక తప్పదని ఆయా టెలికాం కంపెనీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే కేవలం వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ మాత్రమే కాక జియో కూడా ఈ చార్జీలు పెంచబోతున్నట్లు టాక్. దానికి సరిగ్గా డిసెంబర్ 1 ముహూర్తంగా ఫిక్స్ చేశారట. ఈ విషయమై అన్ని కంపెనీలు ఇదే డేట్ ని ఫిక్స్ చేశాయని, ఇక ఆ తేదీ నుండి కేవలం కాల్స్ చార్జీలు మాత్రమే కాక ఇంటర్నెట్ టారిఫ్ ధరలు కూడా పెరగనున్నాయట. అయితే దీనిపై కొందరు టెక్ నిపుణులు మాట్లాడుతూ, తమకు అందిన సమాచారం ప్రకారం డిసెంబర్ 1 నుండి ఇంటర్నెట్ ధరలు కూడా 30 నుండి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఇంత పెద్ద చావు దెబ్బతో వినియోగదారుడి నెత్తిన పిడుగు పడ్డట్లే మరి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: